* విధ్వంసం సృష్టించిన లైలా తుఫాన్

* దివిసీమ ఉప్పెన తరువాత అంతటి దారుణమైన తుఫాన్ ఇదే..

* మూడు రోజులపాటు నరకం చూసిన ఆ ఆరు జిల్లా వాసులు..


ప్రస్తుత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో వరదలు భీభత్సం సృష్టిస్తున్నాయి.. రెండు తెలుగు రాష్ట్రాలపై ప్రకృతి కన్నెర్ర జేసింది.. ఈ వరదల కారణంగా భారీగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగింది.. ఇంతటి ఘోరానికి మానవ తప్పిదం కూడా ఒక కారణమని చెప్పొచ్చు.. ఇలాంటి ప్రకృతి వైపరిత్యాలు గతంలో కూడా చాలానే వచ్చాయి.. వాటి వల్ల కూడా భారీగా నష్టం వాటిల్లింది.. 2010 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన లైలా తుఫాను దీనికి ఒక ఉదాహరణగా చెప్పొచ్చు..అప్పట్లో లైలా తుఫాన్ బీభత్సం సృష్టించింది. ఈ తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాల కారణం గా ఆరు జిల్లాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి..


నెల్లూరు, ఒంగోలు, కృష్ణా, గుంటూరు మరియు ఉభయ గోదావరి జిల్లాలు జలమయం అయ్యాయి..ఈ జిల్లాల్లో జన జీవనం అస్తవ్యస్తం అయింది.. అంతే కాకుండా, విద్యుత్, టెలిఫోన్, రవణా వ్యవస్థ పూర్తిగా నాశనం అయ్యాయి..నడుం లోతు వరద నీటిలో ఈ జిల్లాలోని కోస్తా తీరవాసులు సాయం కోసం ఎంతగానో ఎదురు చూసారు.ఏకంగా మూడు రోజుల పాటు విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో అనేక గ్రామాలు అంధకారంలోనే ఉన్నాయి. జోరుగా వాన..చుట్టూ నీరు.. కరెంటు కూడా లేదు… దిక్కుతోచని స్థితిలో వున్న తుఫాను బాధితులు ఆ సమయంలో అష్టకష్టాలు పడ్డారు.


లైలా తుఫాన్ కారణంగా భారీగా ఆస్తి నష్టం జరిగింది..లైలా తుఫాను రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలను కన్నీట ముంచింది. దాని ధాటికి అనేక జిల్లాల్లో గ్రామాలకు గ్రామాలే జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. భారీ వర్షంతో పాటు ఈదురు గాలులు కూడా వీస్తుండటంతో ఎక్కడి ప్రజలు అక్కడే చిక్కుకుపోయారు. కరెంటులేక కటిక చీకట్లో కొట్టుమిట్టాడుతున్నారు. గ్రామాల మధ్య రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించి పోయింది.1977లో కృష్ణా జిల్లాలో 10 వేల మందిని పొట్టనబెట్టుకున్న దివిసీమ ఉప్పెన తర్వాత అత్యంత దారుణమైన తుపానుగా లైలా తుఫాన్ గురించి చెప్పొచ్చు.12 లక్షల మంది ప్రత్యక్షంగా ప్రభావితమవుతారని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడంతో కోస్తా తీరం మొత్తం భయంతో వణికిపోయింది.నెల్లూరు నుంచి విశాఖపట్నం వరకు ఆంధ్రా కోస్తా తీరం, రాయల సీమలోని కొన్ని ప్రాంతాలు, తెలంగాణ ప్రాంతంలో రెండు రోజుల భారీ వర్షాలు కురిసాయి..లైలా తుఫాన్ తీరం దాటాక కూడా భారీ గాలులు వీచి కొన్ని చోట్ల భారీగా వర్షాలు కురిసాయి.. ఇలా లైలా తుఫాన్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది..

మరింత సమాచారం తెలుసుకోండి: