ఇండియాకు శత్రుదేశం ఏదైనా ఉందా అనే ప్రశ్న వచ్చినప్పుడల్లా.. ప్రతి ఒక్కరి నోటి నుంచి పాకిస్తాన్ అనే పేరు వినిపిస్తూ ఉంటుంది.ఒకప్పుడు ఇండియా నుంచి వేరుపడిన పాకిస్తాన్ ఇక ఇప్పుడు ఇండియా పైచేయి సాధించడానికి ఎప్పుడు వెంపర్లాడుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే.ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ఏకంగా ఆ దేశ అభివృద్ధిని సైతం పట్టించుకోకుండా పాకిస్తాన్ ఎప్పుడు విమర్శలు ఎదుర్కొంటూ ఉంటుంది. అందుకే పాకిస్తాన్లో ప్రపంచ దేశాలన్నీ కూడా ఉగ్రవాద దేశంగా చెబుతూ ఉంటాయి.


 అయితే ఇలా ఇండియా పాకిస్తాన్ మధ్య ఎప్పుడు వైరం కొనసాగుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇరుదేశాల సరిహద్దుల మధ్య ఎప్పుడూ యుద్ధ వాతావరణమే నెలకొంటూ ఉంటుంది. ఒకవైపు పాకిస్తాన్ నుంచి ఎంతోమంది ముష్కరులు భారత సరిహద్దుల్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తే.. ఇక అక్కడే పహార కాస్తున్న సైనికులు వారిని ఎన్కౌంటర్ చేసి మట్టు పెట్టడం ఎన్నో రోజులుగా కొనసాగుతూ వస్తుంది. ఇలా ఎప్పుడూ ఎటువైపు నుంచి కాల్పులు జరుగుతాయి అన్నది అర్థం కాక.. ఉద్రిక్త పరిస్థితులు పాకిస్తాన్, ఇండియా సరిహద్దుల్లో ఉద్రిక్త  పరిస్థితులు నెలకొంటాయి.


 అయితే ఇలాంటి వైరం నేపథ్యంలో  పాకిస్తాన్, ఇండియా మధ్య ఎలాంటి దౌత్య సంబంధాలు కూడా ఉండవు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలాంటి పరిణామాల మధ్య భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ తో సందికి భారత్ సిద్ధంగానే ఉంది అంటూ చెప్పుకోచ్చారు. జమ్మూ కాశ్మీర్లో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన మాట్లాడారు  వారితో మంచి సంబంధం మాకు కూడా ఇష్టమే. కానీ ముందు వారు ఉగ్రవాదాన్ని ఆపాలి. అప్పుడు మేము మంచి సంబంధాలను పునరుద్ధరిస్తాం. స్నేహితులని మార్చుకోగలం.. కానీ ఇరుగుపొరుగు వారిని మార్చుకోలేము కదా. పాక్ ఉగ్రవాదం కారణంగా ఎక్కువ మంది ముస్లింలే చనిపోయారు అంటూ రాజ్ నాథ్ సింగ్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: