తాజాగా రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావు ఇద్దరు తమ పదవులతో పాటు వైసిపికి రాజీనామా చేసేశారు. వీరిలో మోపిదేవి వెంకటరమణ ఇప్పటికే తాను టీడీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. ఇక నెల్లూరు జిల్లాకు చెందిన కావలి మాజీ ఎమ్మెల్యే మస్తాన్‌రావు మొదటి నుంచి టీడీపీలో ఉన్నారు. ఆయన సోదరుడు భీదా రవిచంద్ర యాదవ్ కూడా.. టీడీపీలోనే ఎమ్మెల్సీగా పనిచేశారు. ఇక 2019లో వైసీపీ అధికారంలోకి రావడం.. విజయసాయిరెడ్డి చొరవతో మస్తాన్‌రావు వైసీపీలో చేరి రాజ్యసభకు ఎంపికయ్యారు. ఈసారి ఎన్నికలలో కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో మస్తాన్‌రావు రాజకీయంగా మనసు మార్చుకున్నారు.
మళ్ళీ ఆయన టీడీపీలో చేరడానికి పావులు కలిపారు. దీంతో మోపిదేవి వెంకటరమణ మస్తాన్ రావు ఒకేసారి వైసీపీని, రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకొని టీడీపీలో చేరేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోని ఆదివారం మస్తాన్ రావు చంద్రబాబును కలుసుకోవడం చర్చనీయాంశం అయింది. ఆయన అధికారికంగా టీడీపీలో చేరడమే మిగిలి ఉంది. ప్రస్తుతం వరద విజయవాడను ముంచేస్తుండటంతో చంద్రబాబు. లోకేష్ హడావుడిలో ఉన్నారు. రాజకీయ కార్యకలాపాలను చంద్రబాబు ఇప్పటిలో చేపట్టే అవకాశం లేదు. అయితే టీడీపీలో చేరడానికి ముందుగా చంద్రబాబును గౌరవంగా కలవడానికి మస్తాన్‌రావు విజయవాడకు వచ్చారని.. ఆయన అనుచరులు చెబుతున్నారు. ఇక మోపిదేవి కూడా త్వరలోనే టీడీపీలో చేరనున్నారు.