2014లో చంద్రబాబు నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినప్పుడు.. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు. అప్పుడు అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి తెలుగుదేశం పార్టీ నుంచి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. ఆ టైంలో తెలంగాణకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులకు కచ్చితంగా గవర్నర్ పదవి వస్తుందంటూ.. నాలుగేళ్ల పాటు ఒకటే ప్రచారం ఊదరగొట్టేశారు. ఇంకేముంది మోత్కుపల్లి గవర్నర్ అయిపోతున్నారు అంటూ హడావుడి చేశారు. కట్ చేస్తే చివరకు చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేశారు.


ఇక తాజా ఎన్నికలలో మరోసారి ఆయన ఎన్నికలకు ముందే ఎన్డీఏలో చేరారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పైగా తెలుగుదేశం పార్టీ మద్దతు ఇప్పుడు కీలకము. ఇప్పుడు మరోసారి తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేత మాజీ ఎంపీకి గవర్నర్ పదవి వస్తుందంటూ ప్రచారం జరుగుతోంది. ఆ నేత ఎవరో కాదు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత.. బీసీ వర్గానికి చెందిన మాజీ ఎంపీ కొనకళ్ల‌ నారాయణ. వాస్తవంగా ఈ ఎన్నికలలో మచిలీపట్నం సీట్‌ను నారాయణకు కేటాయించాలి. కానీ జనసేనతో పొత్తులో భాగంగా అప్పటికప్పుడు వైసీపీ నుంచి వచ్చిన ఎంపీ వల్లభనేని బాలసురికి ఈ సీటు జనసేన నుంచి కేటాయించగా.. ఆయన విజయం సాధించారు.


నారాయణ బీసీలలో బలమైన గౌడ సామాజిక వర్గానికి చెందిన నేత. పైగా చంద్రబాబు పొత్తులో భాగంగా సీటు త్యాగం చేయమని అడిగిన వెంటనే ఒప్పుకున్నారు. ఈ క్రమంలోనే వరదలు, వర్షాలు తగ్గిన వెంటనే ఆయనకు తీపి కబురు అందించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న అంచనాలు ప్రకారం కొనకళ్ల‌ నారాయణకు గవర్నర్ పద‌వి ఇవ్వాలని సిఫార్సు చేసేందుకు చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వచ్చే నెలలో ఐదు రాష్ట్రాల గవర్నర్లను మార్చనున్నారు. ఈ క్రమంలోనే అందులో రెండు రాష్ట్రాలు దక్షిణాదిలో ఉన్నాయి. ప్రధానంగా కేరళలో గవర్నర్ మార్పు కాయంగా కనిపిస్తోంది. ఆ రాష్ట్రానికి కొనకళ్ల‌ నారాయణ గవర్నర్‌గా పంపించే అవకాశాలు ఉన్నాయని అత్యంత విశ్వసనీయ‌ వర్గాలు చెబుతున్నాయి. మరి కొనకళ్ల‌ లాంటి బీసీ నేతను గవర్నర్ పదవికి పంపిస్తే.. చంద్రబాబు నమోదు చేసినట్టు అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp