ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఉన్న వైసీపీలో రోజురోజుకు తీవ్ర కలకలం రేగుతుంది. అసలు పార్టీ నుంచి ఎప్పుడు ఎవరు బయటకు వెళ్లిపోతారో కూడా ఎవరికి అర్థం కావడం లేదు. చాలామంది నాయకులు జిల్లాలు వదిలేసి వెళ్లిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. చాలామంది హైదరాబాద్, బెంగళూరులో మకాం వేసి అసలు సొంత జిల్లాలు, సొంత నియోజకవర్గాలను కూడా పట్టించుకోవడం లేదు. చివరకు సొంత నియోజకవర్గంలో వైసీపీ క్యాడర్, వైసీపీ నాయకులు ఫోన్లు చేసినా స్పందించని పరిస్థితి. మరీ ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలలో నాయకులు వైసీపీ అధినేతకు కూడా అందుబాటులో లేకుండా పోయారన్న చర్చ జరుగుతుంది.


వీరు అంతా త్వరలో పార్టీ మారిపోవడం ఖాయమని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఏలూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఆళ్ళ నాని పార్టీకి దూరమయ్యారు. ఆయన వైసీపీకే రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించేశారు. మిగిలిన నాయకులలో మాజీ మంత్రులు అయిన‌ కొట్టు సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు వంటి కీలక నాయకులు కూడా ఇప్పుడు పార్టీ మారెందుకు సిద్ధమవుతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. లేదా క్రియాశీలక రాజకీయాలకు ఈ ఇద్దరు మాజీ మంత్రులు గుడ్ బై చెప్పేసి సైలెంట్ అయిపోవాలన్న ఆలోచన కూడా చేస్తున్నారట. వీరిపై ఇలాంటి ప్రచారం జరుగుతున్నా దీన్ని ఎవరూ ఖండించకపోవడం.. తాము వైసీపీలో ఉంటామని చెప్పకపోవడం.. లాంటివి ఆశ్చర్యంగా మారాయి.


మాజీ హోం మంత్రి తానేటి వనిత కూడా సైలెంట్ అయిపోయారు. పైగా ఆమె గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ క్రమంలో ఇప్పుడు ఆమె తిరిగి టీడీపీలోకి వెళితే ఎలా ఉంటుందన్న సమాలోచనలు కూడా మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు రాజీనామా చేసిన వాళ్లతో కనీసం స్పందించకపోవడం.. పార్టీ అధినేత జగన్ వారిని పట్టించుకోకపోవడం.. మాట్లాడకపోవడం.. తన దారి తను చూసుకుంటూ ఉండడంతో పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన వైసీపీ నాయకులు కూడా వారి దారి వారు చూస్తూనే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. మరికొందరైతే జిల్లాలకు దూరంగా ఉండటంతో పాటు.. ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేసుకోవడం వంటివి.. వారు పార్టీ మార్పు ప్రచారం మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: