కాంగ్రెస్ లో చేరిన BRS ఎమ్మెల్యేలకు ఎదురు దెబ్బ తగిలింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరిన ఎమ్మెల్యేలకు న్యాయస్థానంలో ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. వారి అనర్హతపై నాలుగు వారాల్లో నిర్ణయాలు తీసుకోవాలని స్పీకర్ కార్యాలయానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ లోపు నిర్ణయాలు తీసుకోకపోతే సుమోటోగా కేసును విచారిస్తామని తెలియజేసింది.


పార్టీ వీడిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా స్పీకర్ ను ఆదేశించాలని బీఆర్ఎస్ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ గన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలని హైకోర్టులో బీఆర్ఎస్ నేతలు పిటిషన్ వేశారు. దానిపై విచారణ జరిపిన ధర్మస్థానం తాజాగా ఆదేశాలు జారీ చేశారు.


బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గత ఏప్రిల్ 24వ తేదీన దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు లోతుగా విచారణలు జరిపింది. బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కె.పి వివేకానంద పిటిషన్ దాఖలు చేశారు దానం నాగేందర్ పై అనర్హత వేటును వేయాలంటూ బిజెపి శాసనసభ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి పిటిషన్లు వేశారు.

ఇక ఈ విషయంపై తాజాగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రస్తుతం అసెంబ్లీ కార్యదర్శి వద్ద పెండింగ్ లో ఉన్న అనర్హత పిటిషన్ లను స్పీకర్ వద్ద తక్షణమే ఉంచాల్సి వస్తోంది. నాలుగు వారాల్లోగా విచారణకు సంబంధించి షెడ్యూల్ ను విడుదల చేయాలని ఆ తేదీలను హైకోర్టుకు సమాచారం ఇవ్వాలంటూ కోర్టు స్పష్టం చేసింది. తమ పిటీషన్లపైన స్పీకర్ కాలయాపన చేస్తున్నారనేది పిటీషనర్ల ప్రధానమైనటువంటి ఫిర్యాదు. ఇప్పుడు హైకోర్టు తాజా ఆదేశాలతో అసెంబ్లీ కార్యదర్శి వ్యవహరించాల్సి వస్తోంది. దీంతో స్పీకర్ తుది నిర్ణయం కీలకమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

brs