ఎవరినైనా టీమ్ ఇండియాలో నీకు ఇష్టమైన ఆటగాళ్లు ఎవరూ అంటే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సచిన్ టెండూల్కర్.. ఇలా అనేక పేర్లు వరుస పెట్టి చెబుతారు. అయితే, అదే మహిళా క్రికెటర్లలో నీకు ఇష్టమైన పేర్లు చెప్పండి అంటే అక్కడ సమాధానం కేవలం ఒకరు ఇద్దరు మాత్రమే మహిళా క్రికెటర్ల పేర్లు వినపడతాయి. అందులో ముఖ్యంగా టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మందాన పేరు ముందుగా వినబడుతుంది. ఆమెకి కేవలం భారత్ లో మాత్రమే కాకుండా విదేశాలలో కూడా అభిమానులు ఉన్నారు. పురుషుల క్రికెట్లో విరాట్ కోహ్లీ సచిన్ టెండూల్కర్ ఎంత ఫేమసో.. మహిళా క్రికెట్లో శృతి మందాన అంత ఫేమస్.


ఇకపోతే టీమిండియా మహిళ స్టార్ క్రికెటర్ స్మృతి మందాన తన ఫేవరెట్ క్రికెటర్ ఎవరని చెప్పేసింది. ఆయన ఎవరో కాదు కింగ్ గా పిలుచుకొనే విరాట్ కోహ్లీ తన ఫేవరెట్ బ్యాటర్ అంటూ చెప్పేసింది. తాజాగా ఆవిడ స్టార్ స్పోర్ట్స్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలిపింది. విరాట్ కోహ్లీ ని తాను కలిశానని.. అతడు నుంచి చాలా సూచనలు తీసుకున్నానని ఆవిడ తెలిపింది. ఇకపోతే విరాట్ కోహ్లీ పురుషుల జట్టు నుంచి ఆర్సిబికి ఆడుతుండగా.. స్మృతి మందార మహిళల జట్టు నుంచి ఆర్సిబి జట్టుకు ఐపీఎల్ లో ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది స్మృతి మందాన కెప్టెన్ గా ఆర్సిబి ఐపీఎల్ ట్రోఫీని గెలిచిన సంగతి తెలిసిందే.


ఇదివరకు క్రికెట్లో ఎంతో పేరుగాంచిన సచిన్ టెండూల్కర్, సౌరబ్ గంగూలీ, రోహిత్ శర్మా, మహేంద్ర సింగ్ ధోనిలను కాదనుకొని కోహ్లీ నీ స్మృతి మందాన తన ఫేవరెట్ ఆటగాడిగా ఎంచుకోవడం ఇప్పుడు చర్చ అంశంగా మారింది. ఈ ఇంటర్వ్యూలో తన ఫేవరెట్ క్రికెటర్ ఎవరని ప్రశ్న ఎదురవ్వగా అందుకు తన ఫేవరెట్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అని.. తనని కలిసినప్పుడు ఆయనని బ్యాటింగ్ మైండ్ సెట్ గురించి అడిగానని., బ్యాటింగ్ వెళ్ళినప్పుడు ఏమీ ఆలోచిస్తారో..?మీపై వండే ఒత్తిడి ఎలా అధిగమిస్తారు..? అని అడిగానని తెలిపింది. అందుకు విరాట్ కోహ్లీ తాను అంచనాల గురించి అసలు పట్టించుకోనని జట్టుకు ఏమి అవసరమో దాని గురించి ఆలోచిస్తానని విరాట్ తనతో చెప్పినట్లు స్మృతి మందాన తెలిపింది. ఆ మాటలు విన్న తర్వాత తన మైండ్ సెట్ పూర్తిగా మార్చుకున్నట్లు చెప్పుకొచ్చింది. ఇకపోతే త్వరలో జరగబోయే టి20 ప్రపంచ కప్ కు శృతి మందాన సిద్ధమవుతోంది. రేపటి నుంచి బెంగళూరులోని ఎన్సిఏ లో టీమిండియా మహిళల జట్టు పది రోజుల శిక్షణ శిబిరం మొదలు కాబోతోంది. అక్టోబర్ 3 నుంచి యూఏఈ వేదికగా మహిళల t20 ప్రపంచ కప్ మొదలు కాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: