* కేరళ బాధితులకు 121 ఇండ్లు గిఫ్ట్
* హుదూద్ తుఫాన్ లోను ఆదుకున్న ఈనాడు
* విజయవాడ, ఖమ్మం బాధితులకు 5 కోట్ల సాయం


ఈనాడు సంస్థ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో వేల కుటుంబాలకు ఉపాధి కల్పిస్తోంది ఈ రామోజీరావు స్థాపించిన ఈనాడు. కొంతమందికి స్వయంగా ఉద్యోగాలు ఇస్తున్న ఈనాడు సంస్థ... మరి కొంతమందికి పరోక్షంగా కూడా... సాయం చేస్తుందని చెప్పవచ్చు. తమ సంస్థలో పనిచేసే ప్రతి ఉద్యోగికి ఎప్పుడు అండగా ఉంటుంది ఈనాడు. అయితే తమ ఉద్యోగులే కాకుండా... ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకున్న కూడా ప్రజలకు సహాయం చేస్తూ ముందుకు వెళ్తోంది ఈనాడు సంస్థ.

 
దేశంలోని ఏ మూలన... వరదలు లేదా ఇతర ప్రమాదాలు జరిగిన... వెంటనే స్పందిస్తోంది. అలా చాలామందికి ఇప్పటికే సాయం చేసింది ఈనాడు సంస్థ. 2020 సమయంలో కేరళలోని...అలప్పి వరదలు వస్తే భారీ నష్టమే జరిగింది. అప్పుడు ఏకంగా ఆ ప్రాంత ప్రజలకు ఇండ్లు కూడా నిర్మించి ఇచ్చింది ఈనాడు. ఈనాడు ద్వారా ఓ భారీ విరాళా కేంద్రాన్ని ఏర్పాటు చేసి... వచ్చిన ధనంతో ఏకంగా 121 మందికి కొత్త ఇల్లు నిర్మించి ఇచ్చింది ఈనాడు సంస్థ.

 
అంతేకాదు ఏపీలో హుదూద్ తుఫాను వచ్చినప్పుడు కూడా... అక్కడి ప్రభుత్వానికి భారీ సహాయమే చేసింది. అప్పుడు కూడా ఒక సహాయ నిధిని ఏర్పాటు చేసి.. కొంతమంది ప్రముఖులు, సాధారణ ప్రజలు అలాగే సామాజికవేత్తలు ఇచ్చిన.. డబ్బులతో ఏపీ ప్రజలను ఆదుకుంది ఈనాడు. ఇక ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో... గత వారం రోజులుగా వరదలు వస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సమయంలో కూడా ఈనాడు సంస్థ వెంటనే స్పందించి సాయం చేసింది.రెండు తెలుగు రాష్ట్రాలకు సహాయం చేయడమే కాకుండా..  ఐదు కోట్ల సహాయ నిధిని అందించేందుకు కంకణం కట్టుకుంది ఈనాడు సంస్థ. ఓ ప్రత్యేక సహాయ నిధిని ఏర్పాటు చేసి దాతలు దానం చేయాలని ఈనాడు సంస్థ ముందుకు వచ్చింది. వచ్చిన ఆ ధనాన్ని... రెండు తెలుగు రాష్ట్రాల వరద బాధితులకు అందించనుంది ఈనాడు. ఇలా ప్రకృతి వైపరీత్యాలు వస్తే మహా యజ్ఞంలా పనిచేస్తోంది ఈనాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: