తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం పార్టీ ఫిరాయింపుల.. టెన్షన్ అందరిలోనూ ఉంది.సోమవారం రోజున పార్టీ ఫిరాయించిన గులాబీ నేతలపై తెలంగాణ హైకోర్టు చాలా స్ట్రాంగ్ గా..తీర్పు ఇవ్వడం జరిగింది. నాలుగు వారాల్లోనే...పార్టీ మారిన కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు మరియు దానం నాగేందర్ పైన చర్యలు తీసుకోవాలని.. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కు కీలక ఆదేశాలు ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర హైకోర్టు.

 ఒకవేళ నాలుగు వారాలలో ఈ ముగ్గురు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకపోతే.... మేమే రంగంలోకి దిగి...వాళ్ల పదవులను రద్దు చేస్తామని పరోక్షంగా తెలంగాణ హైకోర్టు వార్నింగ్ ఇచ్చింది. అయితే పార్టీ ఫిరాయించిన గులాబీ నేతల పైన...తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో... ఇటీవల కాంగ్రెస్ లో చేరిన మరో ఏడుగురు గులాబీ పార్టీ ఎమ్మెల్యేల పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. ముగ్గురు ఎమ్మెల్యేల పదవీ రద్దు కాబోతుందని...త్వరలోనే ఉప ఎన్నికలు కూడా రాబోతున్నాయని.... గులాబీ పార్టీ స్పష్టం చేస్తోంది.

 ఇక మణిపూర్ సంఘటనలో కూడా ఎమ్మెల్యేల పదవులు రద్దు అయ్యాయి. ఆ లెక్కన చూస్తే ముగ్గురు రెబల్ టిఆర్ఎస్ ఎమ్మెల్యేల పదవులు కూడా రద్దు కాబోతున్నాయి. అదే జరిగితే కచ్చితంగా ఉప ఎన్నికలు రావడం గ్యారంటీ. అయితే దీనికి నెల రోజుల సమయం మాత్రమే ఉంది.దీంతో ఇటీవల కాంగ్రెస్ లో చేరిన టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అలర్ట్ అవుతున్నారట. మళ్లీ సొంత గూటికి వెళ్లాలని నిర్ణయం తీసుకుంటున్నారట.

కాంగ్రెస్లో ఉంటే పదవులు పోవడమే కాకుండా జనాలు కూడా ఊళ్ళల్లోకి రానివ్వరని.. అలర్ట్ అవుతున్నారట ఈ రెబల్ ఎమ్మెల్యేలు.అందుకే ఇప్పటికే కేసీఆర్ తో... టచ్ లోకి వెళ్ళారట ఏడుగురు ఎమ్మెల్యేలు. మళ్లీ... కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ లో చేరుతామని చెబుతున్నారట. ఎలాగైనా మమ్మల్ని కాపాడాల్సింది కేసీఆర్ ఏ అని అంటున్నారట.అయితే దీనిపై కేసీఆర్ పెద్దగా సానుకూలంగా స్పందించడం లేదని సమాచారం. పార్టీకి ద్రోహం చేసిన వారికి కచ్చితంగా శిక్ష పడుతుందని చెబుతున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

BRS