హైదరాబాద్ లో ఉన్న వినాయకుని విగ్రహాలను ప్రతి సంవత్సరం హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయడం జరుగుతుంది. అయితే హుస్సేన్ సాగర్ లో వినాయక నిమజ్జనాలకు అనుమతులు లేవంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. ఆ ఫ్లెక్సీలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ట్యాంక్ బండ్ మార్గంలో జీ.హెచ్.ఎం.సీ, హైదరాబాద్ పోలీసులు ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం గమనార్హం.
 
మరోవైపు దేవుని విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయకుండా ఇనుప కంచెలను ఏర్పాటు చేయడం ఒకింత సంచలనం అవుతోంది. హుస్సేన్ సాగర్ లో నిమజ్జనంపై ఈరోజు కూడా హైకోర్టులో విచారణ జరుగుతోంది. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు కావడం లేదని లాయర్ వేణుమాధవ్ పిటిషన్ దాఖలు చేశారు. లాయర్ వేణుమాధవ్ తన పిటిషన్ లో హైడ్రాను ప్రతివాదిగా చేర్చాలని కోరారు.
 
నగరంలో వినాయకుని విగ్రహాలు ఏర్పాటు చేసిన వాళ్లకు ఇది ఒకింత షాకేననే సంగతి తెలిసిందే. మరోవైపు హుస్సేన్ సాగర్ లో వినాయకుని నిమజ్జనాలకు అనుమతులు ఇవ్వకపోతే ఎక్కడ నిమజ్జనం చేయాలనే ప్రశ్నలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఈ నిర్ణయం విషయంలో ప్రజల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.
 
చీఫ్ జస్టిస్ బెంచ్ వాదనల ఆధారంగా తుది నిర్ణయం వెలువడనుందని సమాచారం అందుతోంది. హిందువుల పండగలకే ఈ ఆంక్షలు ఏంటని నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వినాయకుని నిమజ్జనం విషయంలో రాబోయే రోజుల్లో ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి వేడుకులు గ్రాండ్ గా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికే వినాయక నిమజ్జన కార్యక్రమాలు పూర్తి కావడం గమనార్హం. హైదరాబాద్ నగరంలో  వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరగాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.


 


మరింత సమాచారం తెలుసుకోండి: