రెండు తెలుగు రాష్ట్రాలలో వరదలు ఒక్కసారిగా రావడంతో రెండు తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులు స్వయంగా పలు రకాల ప్రాంతాలలో పర్యటించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అయితే రెండు రోజుల నుంచి కాస్త వరద తీవ్రత తగ్గుతున్న సమయంలోనే ఇప్పుడు ఆంధ్రకి మరొక ముప్పు పొంచి ఉందని విషయంపై ఏపీ సీఎం చంద్రబాబు ఒక సంచలన రిపోర్టుని తెలియజేశారు.మీడియాతో మాట్లాడుతూ ఉత్తరాంధ్ర జిల్లాలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అక్కడ ప్రకృతి విలయానికి గురయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలియజేశారట.


అలాగే విశాఖపట్నం ,అల్లూరి సీతారామరాజు వంటి ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తాయని వీటివల్ల కొండ చర్యలు విరిగే ప్రమాదం ఎక్కువగా ఉందంటూ అక్కడ ప్రజలను హెచ్చరిస్తున్నారు. ఇలాంటి సమయంలోనే కొండ ప్రాంతంలో ఉండేటువంటి వారు అక్కడ ఉండకూడదని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని తెలియజేశారు. అలా వారిని తరలించేలా జిల్లా కలెక్టర్లకు కూడా అప్రమత్తంగా ఉండాలి అంటూ హెచ్చరించడం జరిగింది. ముఖ్యంగా ఏలేరు ప్రాజెక్టు కు వరద ప్రభావం కూడా కాస్త ఎక్కువగా పెరగడం వల్ల కాకినాడ జిల్లాకు కూడా ముప్పు పొంచి ఉన్నదంటూ తెలియజేశారు.


అలాగే గుంటూరు ,విజయవాడ ,తెనాలి ,నూజివీడు వంటి ప్రాంతాలలో కూడ ఇలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయంటూ ఒక నివేదికను ఇచ్చారు. ఇప్పటికే వరద ప్రాంతాలలోని బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా సహాయం చేస్తున్నదని.. త్వరలోనే వాస్తవ నష్టం ఎంత ఉందనే విషయం తెలుస్తుందని దీంతో కేంద్రానికి కూడా మరొకసారి నివేదిక పంపించి కచ్చితంగా ఈ నష్టం పైన ఒక అంచనా వేస్తామంటూ ఏపీ సీఎం చంద్రబాబు తెలియజేశారు. విజయవాడలో వరద ఇంకా తగ్గడం లేదని 0.51 టీఎంసీల వద్ద నీరు నిలువ ఉందంటూ తెలియజేశారు.. వర్షం రాకపోతే ఇవి తగ్గుతుందని లేకపోతే వరద ప్రభావం మరింత ఎక్కువవుతుందని హెచ్చరిస్తున్నారు. వరద ప్రాంతాలలో ఎలాంటి అంటూ  వ్యాధులు రాకుండా ఉండేందుకు అందుకు తగ్గట్టుగా వైద్య శిబిరాలు, రోడ్డు క్లీనింగ్, బ్లీచింగ్ పౌడర్, హెల్త్ చెకప్ వంటివి చేస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: