అయితే ఇప్పుడు మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. వైసీపీ చిత్తుచిత్తుగా ఓడిపోయింది. తిరిగి రాఘవరావు ఆయన తనయుడు టిడిపిలో కి వచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. చంద్రబాబు ఆయనను పట్టించుకోలేదు. దీంతో రాఘవరావు రెండు రోజుల కిందట సీఎం అర్ఎఫ్ విరాళం పేరుతో చంద్రబాబును కలిసి ఫోటో దిగారు. ఆయన వెంట ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ కూడా ఉన్నారు. సీఎం ఆర్ఎఫ్‌కు సిద్ధ రాఘవరావు రూ.50 లక్షల విరాళం ఇచ్చారు. వాస్తవానికి రాఘవరావు వివాద రహితుడుగా మంచి పేరు తెచ్చుకున్నారు. తెలుగుదేశం ఓడిపోయాక వైసిపి ఆయనపై తీవ్ర వేధింపులకు పాల్పడింది.
ఆయన గ్రానైట్ వ్యాపారాలపై వందల కోట్ల పెనాల్టీ వేసింది. అవి తట్టుకోలేక ఆయన పార్టీ మారిపోయారు. అయితే ఎన్నికలలో ఆయనకు ఎక్కడా టిక్కెట్ కేటాయించలేదు. పైగా ఆయన కోరుకున్న దర్శి టికెట్ ను రెడ్డి వర్గపు నేతకే ఇచ్చారు. కానీ సిద్ధాకు ఇవ్వలేదు. అయితే రాఘవరావు టిడిపిలో చేరికపై కొంతమంది ప్రకాశం జిల్లా టిడిపి నేతలకు అభ్యంతరాలు ఉన్నాయి. ఐదేళ్లు మంత్రిగా ఉండి వేధింపులు పేరుతో పార్టీ మారిన వాళ్ళను ఎంటర్టైన్ చేయాల్సిన అవసరం లేదని.. ఇప్పుడు కూడా పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆయన వస్తున్నారని సంగతి గుర్తుంచుకోవాలని అంటున్నారు. అయితే రాఘవరావు కుటుంబం మాత్రం టిడిపి కండువా కప్పుకునేందుకు బాగా ఉత్సాహం చూపిస్తోంది.