కూటమి ప్రభుత్వం అధికారంలోకి చేపట్టిన తర్వాత మంత్రి నారా లోకేష్ ఒకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడమే కాకుండ, తన బాధ్యతలను నెరవేరుస్తూ.. సహాయం అడిగిన వారందరికీ సహాయం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన కూడా అప్పుడప్పుడు సంచలన కామెంట్స్ కూడ చేస్తూ ఉంటారు లోకేష్. అయితే ఇప్పుడు తాజాగా మరొకసారి తన సోషల్ మీడియా వేదికగా ఒక ట్విట్ షేర్ చేయడం జరిగింది వాటి గురించి చూద్దాం.


తాజాగా మాజీ సీఎం జగన్ పైన మినిస్టర్ లోకేష్ సైతం విమర్శలకు దారి తీశారు.. జగన్ ఇసుక మాఫియా కోసం అన్నమయ్య డ్యామును కొట్టుకుపోయేలా చేశారని 50 మందిని చంపేసి 5 ఊర్లను నాశనం చేశారని ఫైర్ అయ్యారు.. ఇదే ప్లాన్ ప్రకారం ఇనుప పడవలతో ప్రకాశం బ్యారేజ్ నీ కూల్చేయాలని ప్లాన్ తో విజయవాడతో పాటు చుట్టుపక్కల ఉండే ప్రాంతాలను నామరూపాలు లేకుండా చేయాలని చూశారు అన్నట్లుగా లోకేష్ తెలియజేశారు. లక్షలాదిమంది ప్రజలు జల సమాధి అయ్యేలా ఈ జగన్ కుట్ర బట్టబయలు అయింది అంటూ ఒక పోస్ట్ షేర్ చేశారు.


ప్రకాశం బ్యారేజ్ ని ఇనుప  పడవలతో కూల్చేయాలని కుట్ర బెడిసిపోయిందనీ.. వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం, మాజీ ఎంపీ నందిగామ సురేష్ ఈ పని చేశారంటూ లోకేష్ ఆరోపించడం జరిగింది. తమ కుట్రలు బయటపడకుండా ఉండేందుకు వరద ముంపుకు ప్రభుత్వమే కారణమంటే ఒక విష ప్రచారాన్ని సైతం జగన్ మాఫియా చేస్తోంది అంటు లోకేష్ ఫైర్ కావడం జరిగింది. ప్రస్తుతం అందుకు  సంబంధించి ట్విట్ అయితే వైరల్ గా మారుతున్నది. మరి ఈ విషయం పైన అటు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి మరి. ఇప్పటికే వాడి వేడిగా రాజకీయాలు కొనసాగుతూనే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: