దేశంలోనే మంచినిటి సరస్సుగా పేరుపొందింది కొల్లేరు సరస్సు. ఈ సరస్సు ఎంతోమందికి ఉపాధి కల్పిస్తూ ఉన్నది. విజయవాడ వరద ముంపులకు కొల్లేరు కారణమని ప్రజల ప్రాణల కోసం వీటిని క్లీన్ చేయిస్తామంటూ ఏపీ సీఎం చంద్రబాబు తెలియజేశారు. కానీ కొన్ని వేల ఎకరాల భూములను కొంతమంది బడాబాబులు ఆక్రమించడం జరిగిందట.దీనిని కదిలించడం చాలా కష్టమైన విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇది ఇప్పుడే కాదు చంద్రబాబు ఎన్నోసార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కూడా ఇదే మాట చెబుతూ ఉండేవారు. దివంగత నేత రాజశేఖర్ రెడ్డి కూడా కొల్లేరు సరస్సు పైన ఉక్కు పాదం మోపాలనీ చూసిన చేయలేకపోయారట. మరి ఇప్పుడు చంద్రబాబు చెప్పిన ఆ శపదం నెరవేరుస్తారా లేదా చూడాలి.


చంద్రబాబు ప్రభుత్వానికి ఉన్న అతిపెద్ద సవాల్ కొల్లేరు సరస్సు.. విజయవాడ ముంపునకు ముఖ్యమైన కారణం ఈ కొల్లేరు సరస్సులో అక్రమంగా ఉన్నటువంటి కట్టడాలేనట. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఏకీభవించినట్లు తెలుస్తోంది.రాబోయే రోజుల్లో విపత్తుల నుండి విజయవాడ ను కాపాడుకోవాలి అంటే కచ్చితంగా ఈ కొల్లేరు సరస్సును క్లీన్ చేయాల్సిందే అన్నట్టుగా అటు సీఎం డిప్యూటీ సీఎం ఆలోచిస్తున్నట్లు సమాచారం. కానీ అక్కడ జరిగే దండాలు వ్యవహారాలు తెలిస్తే మాత్రం ఎవరూ కూడా ఇది సాధ్యమయ్యే పని అని కాదని తెలియజేస్తూ ఉంటారు.


ఈ కొల్లేరు సరస్సు రెండు లక్షల  22 వేల ఎకరాల విస్తీర్ణంలో ఉన్నదట. అయితే ఇప్పుడు అంత ఆక్రమించారని తెలుస్తోంది. ఏకంగా 12 మండలాలతో పాటు 120 గ్రామాలకు పైగా ఈ సరస్సు  కింద జీవనం సాగిస్తున్నారు. 1970లో అప్పటి ప్రభుత్వం కొల్లేరు లో చేపలు రొయ్యలు పెంచడానికి అనుమతి ఇవ్వడంతో ఒక్కసారిగా అక్కడ ప్రజల దశ మారిపోయిందట. వలస పోయిన ప్రజలే ఏకంగా ఉపాధి కల్పించే స్థాయికి అక్కడ ఎదిగారట. అంత ఆక్రమించడంతో రెండు లక్షల ఎకరాలు ఉన్న ఈసరస్సు  సుమారుగా 70 వేల ఎకరాలకు పడిపోయింది. 1999 లోనే చంద్రబాబు ఆక్రమాలను తొలగించాలని జీవో విడుదల చేసిన అవినోచుకోలేదట. 2006లో రాజశేఖర్ రెడ్డి కొన్ని చెరువులను బ్లాస్టింగ్ చేయించిన అక్కడి అక్రమదారులు కోర్టు వరకు వెళ్లగా అవి ఆపేశారట. కానీ ఈ కొల్లేరు కు అన్ని పార్టీల అండ ఉందని ఏ పార్టీ అధికారంలో ఉంటే అక్కడ దండుకుంటున్నారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి వీరందరికి కోట్ల రూపాయలు వచ్చేటువంటి కొల్లేరును ఖాళీ చేయిస్తారా లేదా అనేది చూడాలి ఇది పవన్ కళ్యాణ్ ,చంద్రబాబుకు ఒక సవాల్ చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: