* ఒంగోలు ఎమ్మెల్యే గా బాలినేని సూపర్ రికార్డ్
 
* ఏకంగా ఐదు సార్లు ఎమ్మెల్యే గా చక్రం తిప్పిన బాలినేని..

* 2012 ఉపఎన్నికల్లో సైతం అఖండ విజయం



బాలినేని శ్రీనివాసరెడ్డి.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఒంగోలు రాజకీయాలలో కీలక నేతగా చక్రం తిప్పిన వ్యక్తిగా బాలినేనికి మంచి గుర్తింపు వుంది..బాలినేని శ్రీనివాసరెడ్డి మాజీ ఎంపీ వై. వి సుబ్బారెడ్డి సోదరి శచీ దేవిని వివాహం చేసుకున్నాడు. ఆయన మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి , ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి సమీప బంధువు కావడంతో బాలినేని రాజకీయ జీవితానికి తిరుగులేకుండా పోయింది..1999లో తన రాజకీయరంగేట్రం చేసిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి... ఇప్పటివరకు ఏకంగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. అయితే 1999లో ఒంగోలు నియోజక వర్గం నుంచి.. మొదటిసారి కాంగ్రెస్ పార్టీ తరఫున బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యే గా విజయం సాధించారు. ఆ తర్వాత 2004 లో వై ఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కూడా బాలినేని బంపర్ మేజారిటీతో గెలిచారు..బాలినేని 2009 సాధారణ ఎన్నికల్లో కూడా అద్భుత విజయం సాధించడం జరిగింది. అయితే ఏకంగా మూడు సార్లు ఎమ్మెల్యే గా గెలవడంతో 2009 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా కూడా అవకాశం దక్కించుకున్నారు.ఆ సమయంలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి చేనేత, జౌలీ శాఖ మంత్రిగా పని చేయడం జరిగింది.


అయితే వైయస్ రాజశేఖర్ రెడ్డి అనూహ్య మరణంతో కాంగ్రెస్ లో కలకలం రేగింది.. సీనియర్ నాయకులంతా జగన్ వైపు వున్నారు.. జగన్ తనకు స్వయానా బంధువు కావడంతో బాలినేని కూడా వైసీపీలో చేరిపోయారు.. 2012 లో జరిగిన ఉపఎన్నికలలో వైసీపీ విజయ ఢంకా మ్రోగించింది..మొత్తం 18 స్థానాలకు ఉపఎన్నికలు జరుగగా వైసీపీ ఏకంగా 15 స్థానాలు సాధించింది..బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆ ఉపఎన్నికలలో 25,476 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ పై విజయం సాధించారు... వైసీపీలో చేరిన తర్వాత.. 2014 లో మరోసారి ఒంగోలు శాసనసభ్యుడిగా విజయం సాధించారు. అయితే ఆ ఎన్నికల్లో వైసీపీ ప్రతిపక్షానికే పరిమితం అయింది.. ఆ తరువాత జగన్ పాదయాత్రతో వైసీపీ క్రేజ్ భారీగా పెరిగింది. 2019 ఎన్నికల్లో వైసీపీ ఏకంగా 151 సీట్లు సాధించి చరిత్ర సృష్టించింది.. బాలినేని కూడా ఒంగోలు నుంచి భారీ మెజారిటీతో గెలుపొందారు.. దీనితో బాలినేనికి జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ లో అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి పదవి దక్కింది. ఇలా ఒంగోలు ఎమ్మెల్యేగా ఏకంగా ఐదు సార్లు విజయం సాధించి చరిత్ర సృష్టించిన బాలినేని శ్రీనివాసరెడ్డి.  2024 అసెంబ్లీ ఎన్నికల్లో దామరచర్ల జనార్దన్ రావు  చేతిలో  ఓడిపోయారు.కూటమి హవాతో బాలినేని విజయానికి బ్రేకులు పడ్డాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: