* 2001 లో టిఆర్ఎస్ లో చేరిక
* హరీష్ , రఘునందన్ మధ్య గొడవ
* 2020 ఉప ఎన్నికల్లో దుబ్బాక ఎమ్యెల్యేగా విజయం
* మెదక్ ఎంపీ గా మొన్న విక్టరీ


బిజెపి పార్లమెంటు సభ్యులు రఘునందన్ రావు... గురించి తెలియని వారు ఉండరు. కెసిఆర్ గురువు అయితే... రఘునందన్ రావు శిష్యుడు అని ఇప్పటికీ చెబుతుంటారు. ఇప్పటికీ ప్రేమతో తన పార్టీలోకి.. కెసిఆర్ పిలిస్తే... కచ్చితంగా రఘునందన్ రావు... గులాబీ పార్టీలోకి వెళ్తారని చాలామంది చెబుతూ ఉంటారు. చాలా సందర్భాల్లో తన గురువు కేసీఆర్ అని చెబుతూ ఉంటారు రఘునందన్ రావు.


అంతేకాదు కేసీఆర్ ప్రసంగాలు విని 2001 సంవత్సరంలో టిఆర్ఎస్ లో చేరినట్లు... చాలా ఇంటర్వ్యూలలో రఘునందన్ రావు చెప్పడం జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్ర సమితిలో తెలంగాణ కోసం చాలావరకు... రఘునందన్ రావు పోరాటం చేశారు. ఆయన లాయర్ వృత్తి చేసుకుంటూనే ఉద్యమంలో పాల్గొన్నారు. అయితే 2013 సమయంలో... సిద్దిపేటలో  హరీష్ రావుకు ఎక్కువగా ప్రాధాన్యత లభిస్తోందని... రఘునందన్ రావు కాస్త అలిగారట.

 దీంతో వీరిద్దరి మధ్య వివాదాలు.. పెరగడంతో రఘునందన్ రావు ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు కేసీఆర్. దీంతో 2013 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు రఘునందన్ రావు. అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును... చేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటన చేసింది. ఇక ఆ తర్వాత కాంగ్రెస్ లో ఎక్కువ రోజులు ఉండలేని రఘునందన్ రావు... దుబ్బాక ఉప ఎన్నికల్లో బిజెపి పార్టీ తరఫున విజయం సాధించారు.

 దుబ్బాక నియోజకవర్గం  టిఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి... అనారోగ్య  కారణాల వల్ల మరణించారు. దీంతో 2020 ఉప ఎన్నికల్లో దుబ్బాక నియోజకవర్గం నుంచి వెయ్యి ఓట్ల తేడాతో విజయం సాధించారు రఘునందన్ రావు. ఆ తర్వాత.. బిజెపి పార్టీలోనే కొనసాగుతూ వచ్చారు. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం దుబ్బాక నియోజకవర్గం లో రఘునందన్ రావుకు ఎదురు దెబ్బ తగిలింది.

 ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో రఘునందన్ రావు అట్టర్ ఫ్లాప్ అయ్యారు. అలాగే దుబ్బాక నియోజకవర్గం లో బిజెపి నేతలు ఆయనకు వ్యతిరేకంగా పనిచేశారట. దీంతో టిఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి.. చేతిలో ధారణంగా ఓడిపోయారు రఘునందన్ రావు. ఇక 2024 పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ ఎంపీగా బిజెపి నుంచి విజయం సాధించారు రఘునందన్ రావు. టిఆర్ఎస్ పార్టీ కంచుకోట ఆయన మెదక్ నుంచి... రఘునందన్ రావు విజయం సాధించడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: