రాజకీయ నాయకులు పార్టీ మారడం అనేది పెద్ద విషయం ఏమీ కాదు. ఎందుకు అంటే అనేక మంది పొలిటికల్ లీడర్లు ఎప్పటికప్పుడు పార్టీ మారిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇక కొంత మంది ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీలోకి వెళ్లడం , అక్కడ తమ పనులను నిర్వహించుకోవడం మళ్ళీ పోటీ చేసి గెలిచినట్లు అయితే మళ్లీ ఏ పార్టీ గెలిస్తే అందులోకి వెళ్లడం ఇలా పార్టీలు మారుస్తూ ఉంటారు. కానీ కొంత మంది మాత్రం తమ సిద్ధాంతాలను పాటిస్తూ పార్టీ ద్వారా తిరస్కరణకు గురి అయిన కూడా ఆ పార్టీ పేరుతో గెలిచిన ఎమ్మెల్యే , ఎంపీ మరియు ఇతర పదవులను వదిలి వేసి మళ్లీ పోటీ చేసి గెలుపొందుతారు.

అలాంటి వారికి జనాల్లో మంచి క్రేజ్ ఉన్నట్లే అని చెప్పవచ్చు. ఇకపోతే తెలంగాణ రాష్ట్రంలో గొప్ప రాజకీయ నాయకుడిగా పేరు తెచ్చుకున్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కూడా అలానే పార్టీకి రాజీనామా చేసిన సందర్భంలో ఆ పార్టీ నుండి వచ్చిన ఎమ్మెల్యే పదవిని కూడా తిరస్కరించి దానికి రాజీనామా చేసి మళ్ళీ ఉప ఎన్నికలలో పాల్గొని విజయం సాధించాడు. కెసిఆర్ తన రాజకీయ ప్రస్తానాన్ని కాంగ్రెస్ పార్టీ ద్వారా మొదలు పెట్టాడు. కొన్ని సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీలోనే కెసిఆర్ తన ప్రయాణాన్ని కొనసాగించాడు. అలా కాంగ్రెస్ పార్టీలో ప్రయాణాన్ని కొనసాగిస్తున్న సమయంలోనే నందమూరి తారక రామారావు తెలుగు దేశం పార్టీ ని స్థాపించడంతో కాంగ్రెస్ పార్టీ నుండి కేసీఆర్ తెలుగు దేశం పార్టీలోకి వచ్చాడు. ఇక తెలుగు దేశం పార్టీలో ఈయన చాలా సంవత్సరాల పాటు కొనసాగాడు. ఎన్నో మంత్రి పదవులను కూడా నిర్వహించాడు.

ఇక 1999 లో చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గం లో స్థానం కల్పించకుండా తప్పించడం కేసీఆర్‌ ను అసంతృప్తికి గురి చేసింది. ఆ తరువాత 2001 ఏప్రిల్ 21 నాడు తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి , డిప్యూటి స్పీకర్ పదవికి రాజీనామా సమర్పించి 2001 ఏప్రిల్ 27 న నూతనంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం నినాదంతో హైదరాబాద్‌ లోని జలదృశ్యం లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని కెసిఆర్ ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత కొత్తగా స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నుండి ఉప ఎన్నికలలో పాల్గొని కేసీఆర్ అద్భుతమైన స్థాయిలో గెలిచాడు. ఇలా పార్టీని వీటి కూడా కేసీఆర్ అద్భుతమైన స్థాయిలో గెలుపొంది తన ఉనికిని చాటుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: