* కానీ ఉప ఎన్నికల్లో గెలిచి హీరో అయిపోయారు
* ఎంపీగా గెలిచి స్ట్రాంగ్ పొలిటిషన్ అయిపోయారు
( తెలంగాణ - ఇండియా హెరాల్డ్)
మెదక్ లోక్‌సభ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు లైఫ్ జర్నీ చాలా ఇన్‌స్పిరేషనల్‌గా ఉంటుంది. ఆయన తన జీవితంలో ఎన్నో సాధించారు. లాయర్ కూడా అయ్యారు. బీఎస్సీ బీఈడీ ఎల్ఎల్బి డిగ్రీలు పూర్తి చేసిన తర్వాత ఆయన ఈనాడు పేపర్‌లో ఐదేళ్లపాటు పనిచేశారు. ఆపై లాయర్‌గా కూడా వర్క్ చేశారు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ బెయిల్ పిటిషన్‌ను అద్భుతంగా హ్యాండిల్ చేసి బాగా పేరు తెచ్చుకున్నారు. అనంతరం, రఘునందన్ రావు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బార్ అసోసియేషన్‌లో న్యాయవాదిగా రిజిస్టర్ అయ్యారు. చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర భావజాలానికి ఆయన స్ట్రాంగ్ సపోటర్ కాబట్టి తెరాస పార్టీలో చేరారు. అలా రాజకీయ జీవితాన్ని 2001, ఏప్రిల్ 27న ప్రారంభించాడు.
రఘునందన్ రావు టీఆర్‌ఎస్‌కు పొలిట్‌బ్యూరో సభ్యునిగా, మెదక్ జిల్లా కన్వీనర్‌గా పనిచేశారు, అయితే, 2013 మే 14న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో సమావేశమయ్యారనే ఆరోపణలపై ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు, దానిని ఆయన ఖండించారు. టీఆర్‌ఎస్‌ను విడిచిపెట్టిన తరువాత, కొంతకాలం కాంగ్రెస్‌లో చేరారు, కానీ వెంటనే రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరారు.
2014 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో దుబ్బాక నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. కానీ గెలవలేదు సోలిపేట రామలింగారెడ్డి మరణంతో 2020లో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలు వచ్చాయి. దాంతో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత ఆ సీటును రీగైన్ చేయడానికి ఎన్నికల్లో పోటీ పడ్డారు. అయితే రఘునందన్ రావు 1,079 ఓట్ల తేడాతో గెలుపొందారు. అప్పటిదాకా ఆయన ఎప్పుడూ గెలవలేదు. ఈ గెలుపుతో ఆయన పేరు మార్మోగింది. బలమైన బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిని ఆయన ఓడించడం అప్పట్లో సంచలనం అయ్యింది. నిప్పు కణికగా మారి ఉవ్వెత్తున ఎగసి ఈ విజయాన్ని ఆయన అందుకున్నారు. రఘునందన్ 2023లో దుబ్బాక అసెంబ్లీ నుంచి పోటీ చేసి బీఆర్‌ఎస్ అభ్యర్థి కోతా ప్రభాకర్ రెడ్డి చేతిలో 53,513 ఓట్ల తేడాతో ఓటమిని చవిచూశారు. 2024లో లోక్‌సభ ఎన్నికలలో మెదక్ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ నేత నీలం మధుపై 39,139 ఓట్లతో మెజారిటీ ఓట్లతో విజయకేతనం ఎగరవేశారు. ఇప్పుడు ఎంపీ అయి రాజకీయాల్లో కీలక నేతగా మారారు.