• ఒక పార్టీ కలిసి రాకపోతే మరొక పార్టీలోకి జంప్ చేయడం కామన్‌

• అలా జంప్ చేసిన వారిలో కొద్దిమంది మాత్రమే సక్సెస్  

• వారిలో యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఒకరు

( తెలంగాణ - ఇండియా హెరాల్డ్)

తెలంగాణ రాజకీయ నాయకుడు యెన్నం శ్రీనివాస్ రెడ్డి పని అయిపోయిందన్న వేళ వేరే పార్టీలోకి దూకి గెలిచారు. శ్రీనివాస్ రెడ్డి బొంబాయి, ఢిల్లీలలో కస్టమ్స్ శాఖలో కొంతకాలం పనిచేశారు. ఆ సమయంలోనే  ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం ప్రారంభమైంది. ఆ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలనే కోరికతో ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. 2002లో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. కొన్నేళ్లుగా పార్టీలో వివిధ పాత్రలు పోషించారు. 2007లో మహబూబ్‌నగర్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.  అతను 2009 ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ఎన్నికలలో పట్టభద్రుల నియోజకవర్గం నుంచి మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం వహించారు, కానీ ఓడిపోయాడు.

యెన్నం శ్రీనివాస్ రెడ్డి 2009లో టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. 2012లో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. 2012, మార్చిలో మహబూబ్‌నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి టీఆర్‌ఎస్ అభ్యర్థి ఇబ్రహీంపై 1,859 ఓట్ల మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. అయితే ఆ తర్వాత శ్రీనివాస్ గౌడ్ చేతిలో 2,535 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2015 నవంబర్ 23న ఆయన బీజేపీకి రాజీనామా చేశారు.

యెన్నం శ్రీనివాస్ రెడ్డి 2016లో చెరుకు సుధాకర్‌తో కలిసి తెలంగాణ ఉద్యమ వేదికను స్థాపించారు. ఆ తర్వాత 2 జూన్ 2017న ఏర్పాటైన తెలంగాణ ఇంటిపార్టీకి ఉపాధ్యక్షుడయ్యారు. 2019, మార్చి 20న మళ్లీ బీజేపీలో చేరారు. 2020లో, అతను బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమితుడయ్యాడు. 2020 గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో మహేశ్వరం నియోజకవర్గానికి డివిజన్ ఇన్‌ఛార్జ్‌గా పనిచేశారు.

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు గాను యెన్నం శ్రీనివాస్ రెడ్డిని 2023 సెప్టెంబర్ 3న బీజేపీ నుంచి సస్పెండ్ చేశారు. 2023, సెప్టెంబర్ 17న హైదరాబాద్‌లో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం రెండవ జాబితాలో మహబూబ్‌నగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయనను ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: