ఈ తరుణంలోనే ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు వరుసగా నాలుగవసారి బాధ్యతలు తీసుకోవడం జరిగింది. కూటమి ఏర్పాటుకు కీలకపాత్ర వహించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి ఇచ్చి చేతులు దులుపుకున్నారు.అయితే ఏపీ కేబినెట్ విస్తరణ అయినప్పటి నుంచి ఇప్పటివరకు జనసేన నేతల్లో కాస్త అసంతృప్తి కనిపిస్తోంది. ప్రతి విషయంలో జనసేనకు ప్రాధాన్యత ఉండటం లేదని నేతలు చర్చించుకుంటున్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు.. రేపు ఉపముఖ్యమంత్రితోపాటు హోమ్ మినిస్టర్ పదవి ఇవ్వాలని మొదటి నుంచి జనసేన డిమాండ్ చేయడం జరిగింది. కానీ ఆ పదవులు మొత్తం టిడిపి వాళ్ళకే వెళ్లాయి. డిప్యూటీ ముఖ్యమంత్రితో పాటు చిన్న చిన్న మంత్రి శాఖలు మాత్రమే పవన్ కళ్యాణ్ కు దక్కాయి. అటు 21 మంది ఎమ్మెల్యేలు ఉంటే.... జనసేన నుంచి పవన్ కళ్యాణ్ తో పాటు కందుల దుర్గేష్, నాదెండ్ల మనోహర్ కు మాత్రమే మంత్రి పదవి దక్కింది.
ఇక ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల భర్తీల విషయంలో కూడా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు... కొత్త కుట్రలకు తెర లేపుతున్నారట. నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో జాప్యం చేసేందుకు చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారట.ఇప్పుడు కాకుండా మరో ఏడాది తర్వాత నామినేటెడ్ పదవులను భర్తీ చేయాలని అనుకుంటున్నారట. ఆ పదవుల్లో కూడా ఎక్కువగా టిడిపికి వచ్చేలా చూస్తున్నారట చంద్రబాబు నాయుడు. ఆ విషయంలో ఎక్కడా తగ్గేది లేదంటున్నారట. దీంతో జనసేన నేతలు.. ఆగమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.