వైసీపీ అధినేత జగన్ తీరుతో ఆ పార్టీ నేతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారా.. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు కీలక పదవుల్లో ఉన్నవారు.. మంత్రులుగా ఉన్నవారు.. జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఉన్నవారు సైతం జగన్ తీరుతో విసిగిపోతున్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీకి కొందరు సీనియర్ల దూరంగా ఉంటూ వస్తున్నారు. మరికొందరు నేతలు ఇప్ప‌టికే జగన్‌కి గుడ్ బై చెప్పేసారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ సైతం ఎన్నికల తర్వాత బెంగళూరులోనే ఎక్కువగా ఉంటున్నారు. ఏపీకి వచ్చిన ఒకటి, రెండు రోజులు మాత్రమే ఉంటున్నారు. అది కూడా కొందరు కీలక నేతలు మాత్రమే కలుస్తున్నారు. పార్టీ చిత్తుగా ఓడిపోయిన తర్వాత అయినా పార్టీ నాయకులకు ద్వితీయ శ్రేణి నాయ‌కులు కూడా అందుబాటులో లేని పరిస్థితి.


జగన్ స్వీయ తప్పిదాల కారణంగానే ఎన్నికల్లో ఓడిపోవలసి వచ్చిందని.. పార్టీకి చెందిన నేతలు ఎన్నికల ఫలితాల తర్వాత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని వేధించడం, ప్రతిపక్షాలకు కనీస గౌరవం ఇవ్వకపోవడం.. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలు పడుతున్న ఇబ్బందులను కూడా తీర్చకపోవడం.. ఎంతవరకు తాను చేస్తున్న సంక్షేమం, తాను ప్రజల అకౌంట్లో వేస్తున్న డబ్బులు మాత్రమే తనను అధికారంలోకి తీసుకువస్తాయని అతి ధీమాకు పోవడం.. ఇవన్నీ వైసీపీని ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించాయి.


అధికారం కోల్పోయిన తర్వాత కూడా తమను అస్సలు పట్టించుకోకపోవడంతో.. క్షేత్రస్థాయిలో వైసీపీ శ్రేణులు అయితే పూర్తిగా డీలా పడిపోతున్నాయి. చాలామంది పార్టీ కీలక నేతలు, ద్వితీయ నాయకులు.. జనసేన లేదా తెలుగుదేశం పార్టీలో చేరిపోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. తెలుగుదేశంలో చేరేందుకు అభ్యంతరాలు ఉన్న నేతలు.. జనసేన లేదా బిజెపిలోకి వెళ్లే ఆలోచన చేస్తున్నారు. ఏది ఏమైనా జగన్ అధికారంలో ఉన్నప్పుడు తనకు తానే రాజుగా ఊహించుకుంటూ.. ప్రతిపక్షంలో ఉన్నపుడు అస్సలు పట్టించుకోకపోవడంతో.. చాలామంది నేతలు జగన్‌కు దండం పెట్టి పార్టీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: