* పొలిటికల్ కెరియర్ బ్లాక్ బస్టర్ అని నిరూపించిన మేకపాటి బ్రదర్స్..

•పార్టీ మారినా ప్రజల మన్ననలు తగ్గిపోలేదు..

•పార్టీ ఏదైనా తమదేహావా అంటున్న మేకపాటి బ్రదర్స్..



(ఆంధ్రప్రదేశ్ - ఇండియా హెరాల్డ్)

బ్రాహ్మణపల్లి ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందిన మేకపాటి రాజ మోహన్ రెడ్డి పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగుతున్నారు. 14వ లోక్సభకు ఆంధ్రప్రదేశ్లోని నరసరావుపేట లోకసభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్లో తనదైన ప్రతిభ కనబరిస్తూ ప్రజలకు మేలు చేస్తూ.. ప్రజల మన్ననలు పొందిన ఈయన 2012 ఫిబ్రవరి 28న 15వ లోక్సభ సభ్యుడిగా రాజీనామా చేసి వైఎస్ఆర్సిపిలోకి వెళ్లిపోయాడు. అలా కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరిన ఈయన.. 2012 జూన్ 15న జరిగిన ఉప ఎన్నికలలో వైసిపి తరఫున నెల్లూరు నుంచి పోటీ చేసి, ప్రత్యర్థి సుబ్బి రామిరెడ్డి పై విజయం సాధించారు.. రాజీనామా చేసి, పార్టీ మారినా, ప్రజలలో మాత్రం విశ్వాసాన్ని కోల్పోలేదు. అందుకే పార్టీ మారినా సరే మళ్లీ ఉపఎన్నికలలో ఇంకో పార్టీ నుంచి పోటీ చేసి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు.

ఈయనే కాదు ఈయన సోదరుడు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కూడా సోదరుడితో పాటే కాంగ్రెస్లో కొనసాగారు. ఈయన కూడా 2012 ఉప ఎన్నికలలో  ఉదయగిరి నుంచి అసెంబ్లీకి పోటీ చేసి గెలుపొందారు. ఈయన కూడా సోదరుడు మేకపాటి రాజశేఖర్ రెడ్డి లాగే కాంగ్రెస్లో కొనసాగి మళ్లీ వైసీపీ పార్టీ వచ్చిన తర్వాత అక్కడ నుంచి వైసీపీ పార్టీలోకి జంప్ అయ్యారు. అయినా సరే ఇక్కడ 2012లో జరిగిన ఉప ఎన్నికలలో తన సోదరుడిలాగే పోటీ చేసి గెలుపొందారు.  మొత్తానికైతే ఈ మేకపాటి బ్రదర్స్ ఇద్దరు కూడా పార్టీ మారినా పొలిటికల్ కెరియర్ బ్లాక్ బస్టర్ అంటూ  నిరూపించారు.

ఇకపోతే మేకపాటి రాజ మోహన్ రెడ్డి తన దాతృత్వాన్ని కూడా నిరూపించుకున్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో 100 ఎకరాల్లో స్థాపించిన రూ.225 కోట్ల విలువైన మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలను,  అందులోని భవనాలను అలాగే ఇతర ఆస్తులను ప్రభుత్వానికి అందిస్తానని తెలిపారు. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు మీద ఉన్న వ్యవసాయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఏది ఏమైనా మేకపాటి బ్రదర్స్ మంచి మనసు తోనే కాదు పొలిటికల్ పరంగా కూడా విజయం సాధించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: