- బిజెపిలో తిరుగులేని లీడర్.
- తను అనుకున్న నినాదం మరవని నేత.
- పట్టు కోసం సకల ప్రయత్నం.

 రాజకీయ నాయకుడు అంటే  అవసరాలను బట్టి పదవుల కోసం పార్టీలు మారుతూ  ఉండేవారు కాదు. ప్రస్తుత కాలంలో అలాంటి రాజకీయ నాయకులు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఈ సందర్భంలో కూడా కొంతమంది నాయకులు ప్రజా సేవ చేస్తూ  ప్రజల్లో తిరుగుతూ తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సాధిస్తున్నారు.  తెలంగాణ రాష్ట్రంలో చెప్పుకోదగ్గ నేతల్లో యెండెల లక్ష్మీనారాయణ కూడా ఒకరు. ఈయన బిజెపి పార్టీ అంటే తెలియని రోజుల్లోనే బిజెపి నుంచి పోటీ చేసి రెండు సార్లు గెలుపొందారు. ఆయన బిజెపిలో గెలిచిన సమయంలో తెలంగాణలో అసలు బిజెపి  డిపాజిట్లు కూడా వచ్చేవి కావు.  అలాంటి లక్ష్మీనారాయణ సీనియర్ కాంగ్రెస్ నేత అయినటువంటి ధర్మపురి శ్రీనివాసును రెండుసార్లు ఓడించారు. అలా బిజెపిలో తిరుగులేని నేతగా ఎదిగినటువంటి యెండెల లక్ష్మీనారాయణ గురించి  ఎవరికి తెలియని కొన్ని విషయాలు తెలుసుకుందాం..

 లక్ష్మీనారాయణ రాజకీయ ప్రస్థానం :
 ఈయన నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి నేత. 1963 మార్చి 1న జన్మించారు. లక్ష్మీనారాయణ తండ్రి మూడుసార్లు పురపాలక సంఘం కౌన్సిలర్ గా పని చేశారు. తండ్రి నుంచి రాజకీయ ఓనమాలు నేర్చుకున్న లక్ష్మీనారాయణ డిగ్రీ చదివే సమయంలోనే కళాశాలలో జరిగే విద్యార్థి ఎన్నికల్లో విజయం సాధించారు.  ఆ తర్వాత బిజెపిలో చేరి రాజకీయ అరంగేట్రం మొదలుపెట్టారు.  ముందుగా భారతీయ జనతా పార్టీ యువమోర్చాలో పనిచేసి ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియమించబడ్డాడు. పార్టీ అధిష్టానం గుర్తించే విధంగా తయారైనటువంటి లక్ష్మీనారాయణ 2009 ఎన్నికల్లో మొదటిసారి  నిజామాబాద్ పట్టణ శాసనసభ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేశారు.


ఈయనకు సమీప అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి ధర్మపురి శ్రీనివాస్  పోటీ చేశారు. అయినా లక్ష్మీనారాయణ అద్భుతమైన మెజారిటీ సాధించి ధర్మపురి శ్రీనివాస్ ను ఓడించాడు.  ఆ తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో ఆయన తన పదవికి రాజీనామా చేసి మరోసారి వచ్చిన ఉప ఎన్నికల్లో  బిజెపి నుంచి పోటీ చేశారు. ఈ టైంలో కూడా ధర్మపురి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో కూడా లక్ష్మీనారాయణ అద్భుతమైన మెజారిటీతో మరోసారి గెలుపొందారు.  అలా బిజెపి పార్టీ శాసనసభ పక్ష నేతగా ఆయన ఎన్నికయ్యారు. నిజామాబాద్ లో తిరుగులేని లీడర్ గా బిజెపి పార్టీని కాపాడుకుంటూ వచ్చిన లక్ష్మీనారాయణ 2014 ఎన్నికల్లో లోక్ సభ నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు పోటీ చేశారు  కానీ ఆ ఎన్నికల్లో ఆయన దారుణంగా ఓటమి పాలయ్యారు. బిజెపిలో ఆయనకున్న క్రేజ్ ను గుర్తించి  అధిష్టానం ఆయనకు రాష్ట్ర ఉపాధ్యక్ష పదవిని కట్టబెట్టింది. బిజెపిలో తిరుగులేని లీడర్ గా ఎదిగారు యెండెల లక్ష్మీనారాయణ.

మరింత సమాచారం తెలుసుకోండి: