- తెలంగాణ బీజేపీ లో ముదురుతోన్న రాజ‌కీయాలు.. !
- డీకే అరుణ దూకుడు ఇష్ట‌ప‌డ‌ని కీల‌క నేత‌లు .. !

- ( ద‌క్షిణ తెలంగాణ - ఇండియా హెరాల్డ్ ) .

తెలంగాణ బిజెపిలో ముసలం మొదలైందా.. మాజీమంత్రి ... మహబూబ్ న‌గర్ ఎంపీ డీకే అరుణను రాజకీయంగా టార్గెట్ చేస్తున్నారా ?  ఫైర్ బ్రాండ్‌గా ఉండే అరుణ కొద్ది కాలంగా తన దూకుడు ఎందుకు తగ్గించారు... ఆమె అడపా దడపా మీడియా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నా మునుప‌టిలా ఎందుకు దూకుడుగా వ్యవహరించడం లేదు. గద్వాల జేజమ్మ తన స్టైల్ లో అగ్రెసివ్ గా ఎందుకు వెళ్ళటం లేదు అన్న చర్చ ప్రధానంగా వినిపిస్తోంది. బిజెపి తెలంగాణ రాష్ట్ర ప్రెసిడెంట్ పోస్టులో రైసులో డీకే అరుణ పేరు ముందు నుంచి ప్రధానంగా వినిపించింది.


ఈ కీలకమైన సమయంలో అరుణ‌ పెద్దగా యాక్టివ్ రోల్ పోషించకపోవడానికి కారణం ఏంటన్నది ..  ఎవరికి అంతపట‌ట్డం లేదు. అరుణ పేరు అధ్యక్ష రేసులో నుంచి తప్పించారని మరో నేత పేరును అధిష్టానం పరిగణలోకి తీసుకోవడంతోనే అరుణ తన దూకుడు తగ్గించారని పార్టీలో గుసగుసలాడుకుంటున్నారు. డీకే అరుణ అంతలా సైలెంట్ అవ్వటానికి కారణం తెలంగాణ బిజెపిలో జరుగుతున్న పరిణామాలే కారణమా ?రాష్ట్ర నాయకత్వంతో ఆమెకు విభేదాలు ఉన్నాయా అన్న చ‌ర్చ‌ కూడా మీడియా వర్గాలలో వినిపిస్తోంది.


వాస్తవానికి అరుణ గత ఎన్నికలలో మహబూబ్ న‌గర్ నుంచి స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. ఫైర్ బ్రాండ్ లేడీ గారి పేరు ఉన్న ఆమె పార్లమెంటుకు ఎంపిక కావడంతోనే తెలంగాణ బిజెపిలో కొందరికి నచ్చలేదని ... కావాలనే ఆమెను రాజకీయంగా అణ‌గదొక్కేందుకు సొంత పార్టీకి చెందిన నేతలే తెరవెనక ప్రయత్నాలు చేస్తూ ఆమెకు తెలంగాణ బిజెపి అధ్యక్షురాలు పగ్గాలు దక్కకుండా ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. అందుకే ఆమె సైలెంట్ అయ్యారని టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: