నారా లోకేష్‌, టీడీపీ నేతలు పొద్దున లేస్తే చాలు రెడ్‌ బుక్‌ అంటూ కామెంట్స్‌ చేస్తారు. అయితే.. తాజాగా రెడ్‌ బుక్‌ పై తన స్టైల్‌ లో కౌంటర్‌ ఇచ్చారు మాజీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి.  గుంటూరు జిల్లా కారాగరంలో మాజీ ఎంపీ నందిగం సురేష్ ను మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి..పరామర్శించడం జరిగింది. ఇక జగన్ ను  చూడగానే కన్నీరు పెట్టుకున్నారు మాజీ ఎంపీ నందిగం నందిగం సురేష్. అనంతరం సురేష్ ను ఓదార్చి, నేనున్నాను ధైర్యంగా ఉండు అంటూ భరోసా ఇచ్చారు జగన్.


అనంతరం రెడ్‌ బుక్‌, చంద్రబాబుపై విరుచుకుపడ్డారు జగన్‌. రెడ్ బుక్ రాయడం గొప్పకాదని... రెడ్ బుక్కు పేరుతో మా నేతలను వేధిస్తున్నారని ఆగ్రహించారు. మేం అందరినీ గుర్తు పెట్టుకుంటామని.. త్వరలోనే టీడీపీ నేతలు కూడా ఇదే గుంటూరు జైలుకు వెళతారని హెచ్చరించారు. నేను ఎప్పుడూ చంద్రబాబును ఉద్దేశపూర్వకంగా వేధించలేదని క్లారిటీ ఇచ్చారు. కానీ ఇప్పుడు  మీరు చూపించిన దారిలోనే నేను నడుస్తాను.. రాబోయే రోజుల్లో ఇదే గుంటూరు జైల్లో మీ నేతలు ఎంతమంది ఉంటారో చూసుకోండని తేల్చి చెప్పారు.


చంద్రబాబు వరదల మేనేజ్మెంట్ ను చేయలేక 60 మంది మృతికి కారణమయ్యాడని ఫైర్ అయ్యారు జగన్‌. ఆ విషయాన్ని పక్కదారి పట్టించేందుకే మా నేతలపై ,టిడిపి కేంద్ర కార్యాలయం పై జరిగిన దాడి అని అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నాడని నిప్పులు చెరిగారు.  60 మంది మృతికి కారణమైన సీఎం చంద్రబాబు మీద కేసు పెట్టాలని డిమాండ్‌ చేశారు జగన్‌.


చంద్రబాబు వరదల్లో పూర్తిగా ఫెయిల్ అయ్యారని... అందుకే టిడిపి కార్యాలయంపై దాడి కేసులో అరెస్టు చేశారని మండిపడ్డారు. ఆరోజు టిడిపి కార్యాలయంలో పిసి పెట్టి సిఎంను ల***కొడకా అని తిట్టాడని నిప్పులు చెరిగారు. దీంతో వైసిపి కార్యకర్తలు ధర్నాకు వచ్చారని... నేను చంద్రబాబు మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదన్నారు. పోలీసులే తప్పుడు కేసులు పెట్టి తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారని ఆగ్రహించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: