ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి అవుతుంది. ఇక ఈ 100 రోజుల లోనే తెలుగు దేశం పార్టీ కి అనేక సవాళ్లు ఎదురు అయ్యాయి. వాటన్నింటిని తెలుగు దేశం పార్టీ అధినేత , ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు ఎంతో చాకచక్యంగా ఎదుర్కొంటూ వస్తున్నాడు. ఇకపోతే ఈ సారి ఎన్నికలలో తెలుగు దేశం , జనసేన , బీ జే పీ మూడు పార్టీలు కలిసి పొత్తులో భాగంగా పోటీ చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇక ఈ పొత్తు సూపర్ గా సక్సెస్ అయ్యింది. తెలుగు దేశం పార్టీ కి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థులు పెద్ద మొత్తంలో గెలుపొందగా ... జనసేన నుండి పోటీ చేసిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థి గెలుపొందాడు.

ఇక బీ జే పీ నుండి కూడా పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యే అభ్యర్థులు గెలిచారు. దానితో చంద్రబాబు గడచిన 100 రోజుల్లో తన పార్టీ నేతలకు , కార్యకర్తలకు ఏ స్థాయిలో ప్రాముఖ్యతను ఇస్తూ వస్తున్నాడో అలాగే జనసేన , బీ జే పీ వారికి కూడా ప్రాముఖ్యతను ఇస్తూ రావడంలో సక్సెస్ అయ్యాడు. ఇకపోతే జనసేన పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రనికి ఉప ముఖ్యమంత్రి గా పదవీ బాధ్యతలను నిర్వహించడం మాత్రమే కాకుండా , కొన్ని కీలక మంత్రి పదవులను కూడా నిర్వహిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ 100 రోజుల పాలనలో పవన్ పాత్ర కూడా ఎంతో కీలకంగా ఉంది. ఇక పవన్ తన జనసేన క్యాడర్ ను సమన్వయ పరచడంలో కాస్త విఫలం చెందాడు అనే వార్తలు వస్తున్నాయి.

ఎందుకు అంటే పవన్ ఎక్కువ శాతం తనకు ఇచ్చిన బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించడం కోసం కసరత్తు చేస్తూ ఉండడం వల్ల తన పార్టీ క్యాడర్ ను అన్ని విషయాలలో సమన్వయ పరిచి ముందుకి తీసుకు వెళ్లడంలో పవన్ కాస్త ఫెయిల్ అయ్యాడు. అనే నెగెటివిటీ ఈ 100 రోజుల్లో సంతరించుకుంది. కానీ రాబోయే రోజుల్లో పవన్ తన పార్టీ క్యాడర్ ను సమన్వయ పరిచి అద్భుతమైన స్థాయిలో ముందుకు తీసుకువెళ్తారు అని చాలా మంది భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: