* ఏపీకి నో ప్రత్యేక హోదా
* రాజధాని అభివృద్ధికి 15 వేల కోట్ల అప్పు !
* రాజధాని అభివృద్ధికి అంతంత మాత్రమే నిధులు


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కూటమి సర్కార్ ఏర్పాటు అయి దాదాపు 100 రోజులు పూర్తయిందని చెప్పవచ్చు. ఈ వంద రోజుల చంద్రబాబు పాలనలో... మిశ్రమ ఫలితాలు దక్కాయి. మొన్నటి వరకు వరదలు... ఏపీని కుదిరిపోయాక... అంతకుముందు.. పెన్షన్లను పెంచి.. అన్న క్యాంటీన్లను ప్రారంభించి హడావిడి చేసింది చంద్రబాబు సర్కార్. అయితే.. ఏపీలో మూడు పార్టీలు కలిసి అధికారంలోకి రావడం జరిగింది.


ఇందులో భారతీయ జనతా పార్టీ.. ఉండడం ఏపీకి.. చాలా ప్లస్ అవుతుందని అందరూ అనుకున్నారు.  అదే సమయంలో మోడీ కేంద్రంలో అధికారంలోకి రావడంతో కచ్చితంగా ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందని అందరూ అనుకున్నారు. ఇటు చంద్రబాబు నాయుడు.. సపోర్ట్ చేస్తేనే... మోడీ ప్రభుత్వం నిలబడడంతో.. ఏపీ ప్రజలు చాలా సంబరపడిపోయారు. చంద్రబాబు నాయుడు కచ్చితంగా మోడీ మెడలు వంచి...  ప్రత్యేక హోదా తీసుకు వస్తారని అందరూ అనుకున్నారు.


కానీ కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత అసలు ఏపీని... పట్టించుకోనట్లే బిజెపి ప్రవర్తిస్తోంది. నాలుగు కేంద్ర మంత్రి పదవులు పడేసి.. ప్రత్యేక హోదా లేనట్లే వ్యవహరిస్తోంది మోడీ ప్రభుత్వం. ఒకవేళ ఏపీకి.. ప్రత్యేక హోదా ఇస్తే బీహార్ అలాగే తెలంగాణ రాష్ట్రాలు అడుగుతాయని... చంద్రబాబుకు మోడీ ప్రభుత్వం ముందే చెప్పిందట. ప్రత్యేక హోదా తప్పితే మరే సహాయమైనా చేస్తామని తెలిపిందట. దీంతో మోడీ ప్రభుత్వంతో...  ప్రత్యేక హోదా అంశం పైన మాట్లాడలేకపోతున్నారట చంద్రబాబు.


అంతే కాకుండా.. రాజధాని కోసం ప్రత్యేక నిధులు సరిగా కేటాయించడం లేదట కేంద్ర ప్రభుత్వం. ముఖ్యంగా...  మొన్నటి బడ్జెట్లో అమరావతి రాజధాని నిర్మాణం కోసం 15 వేల కోట్లు కేటాయించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే ఆ 15 వేల కోట్లు.. ఇంట్రెస్ట్ తో కలిపి మళ్ళీ.. బ్యాంకులకు ఏపీ సర్కార్ కట్టాల్సిందే. అందులో కేంద్రం ఇచ్చింది ఏమీ లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: