* దూసుకు వెళ్తున్న రియల్ ఎస్టేట్ రంగం
* అమరావతిలో 1100 కోట్లతో హ్యాపీనెస్త్ ప్రాజెక్టు
* కేంద్రం నుంచి 15 వేల కోట్ల సాయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయి 100 రోజులు దాదాపు పూర్తయింది. అయితే ఈ 100 రోజుల పాలనలో... పెన్షన్ల పంపిణీ అలాగే, అన్నా క్యాంటీన్ల ప్రారంభం తప్ప పెద్దగా చంద్రబాబు సర్కారు ఏమీ చేయలేదని కొంత మేర ఆరోపణలు వస్తున్నాయి. కానీ.. ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో చంద్రబాబు సర్కార్ చాలా దూకుడుగా వెళ్తుందని చెప్పవచ్చు. జగన్మోహన్ రెడ్డి పాలనలో మూడు రాజధానులు అని.. రాజధాని లేకుండా చేయడం జరిగింది.
కానీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటగా అమరావతి పైన ప్రత్యేకమైన ఫోకస్ చేశారు. ముఖ్యంగా మంత్రి నారాయణ చేతుకు అమరావతి బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. ఆయన ప్రతిరోజు అమరావతి డెవలప్మెంట్ పైన సమీక్షలు నిర్వహించుకుంటూ ముందుకు సాగుతున్నారు. అదే సమయంలో కేంద్రం నుంచి.. అమరావతికి భారీ స్థాయిలో నిధులు కూడా వస్తున్నాయి.
మొన్నటి బడ్జెట్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి కోసం... కేంద్ర ప్రభుత్వం భారీగానే బడ్జెట్ పెట్టింది. 15 వేల కోట్ల ఆర్థిక సహాయాన్ని... ఏపీకి ప్రకటించడం జరిగింది. అయితే ఇది అప్పు అయినా సరే తక్కువ వడ్డీతో... ఏపీకి న్యాయం జరుగుతుంది. అంతేకాదు... అమరావతి రాజధానిలో హ్యాపీనెస్ ప్రాజెక్టుకు కూడా శ్రీకారం చుట్టింది చంద్రబాబు సర్కార్. మొదటిసారి చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పుడే ఈ ప్రాజెక్టును ప్రారంభించగా.. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అసలు పట్టించుకోలేదు. ఇక ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు దీనిపైన.. ఫోకస్ చేశారు.
930 కోట్లతో ఈ ప్రాజెక్టు ప్రారంభం కానుంది. అయితే గతం కంటే ఎక్స్పెండీచర్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో... మరో 200 కోట్లు అదనంగా ఖర్చు అయ్యే ఛాన్స్ ఉంది. ఈ ప్రాజెక్టులో భాగంగా అత్యాధునిక భవనాలు నిర్మించనున్నారు. అదే సమయంలో అమరావతిలో పెట్టుబడులను ఆకర్షిస్తోంది చంద్రబాబు సర్కార్. గతం కంటే అమరావతి బ్రాండ్ పెరిగిందని చెప్పవచ్చు. రియల్ ఎస్టేట్ రంగం కూడా అభివృద్ధి చెందుతోంది.