వరద బాధితులను ఆదుకోవడంలో బాబు సక్సెస్ అని ఆయన స్థాయిలో మరో నేత ఎవరూ వరద బాధితులను ఆదుకోవడానికి ముందుకు రాలేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అక్షయ పాత్ర ద్వారా చంద్రబాబు వరద బాధితులకు ఆహారం విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. విజయవాడ కలెక్టరేట్ కు చంద్రబాబు పరిమితం కావడంతో పాటు వరద బాధితులకు తన వంతు నష్ట పరిహారం ప్రకటించారు.
ఇళ్లలో ఎలక్ట్రానిక్ వస్తువులు పాడు కావడం వల్ల ఎవరైనా ఇబ్బందులు పడుతూ ఉంటే ఇళ్లకు మెకానిక్ లు వచ్చి వాటిని రిపేర్ చేయించే బాధ్యత సైతం తాను తీసుకుంటానని బాబు హమీ ఇవ్వడం జరిగింది. ఇతర ప్రాంతాల నుంచి మెకానిక్ లు వచ్చి మరీ ప్రజల వస్తువులను వేగంగా రిపేర్ చేసి ఇస్తున్నారు. పూర్తిగా నీట మునిగిన ఇళ్లలో నివశించే వాళ్లకు మేలు జరిగేలా బాబు నిర్ణయాలు ఉన్నాయి.
విజయవాడ ప్రజలకు సాధారణ పరిస్థితి వచ్చే వరకు వరద బాధితులపై బాబు ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. ఏపీలో పరిస్థితులు ఇప్పుడిప్పుడే మారుతున్నాయనే సంగతి తెలిసిందే. చంద్రబాబు నాయుడు 100 రోజుల పాలన మరీ అద్భుతంగా లేకపోయినా సంతృప్తికరంగానే ఉందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. పథకాలను వేగంగా అమలు చేయాలని ఏపీ ప్రజలు కామెంట్లు చేస్తున్నారు. చంద్రబాబు పాలనకు నూటికి 80 మార్కులు వేయొచ్చని వాళ్లు చెబుతున్నారు.