ఇటివలె రాజకీయాలు వైసిపి, టిడిపి పార్టీ మధ్య అగ్గి రాజేసేలా కనిపిస్తున్నాయి.. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కౌంటర్లకు ప్రతి కౌంటర్ ఇస్తూ ఉన్నారు మాజీ సీఎం జగన్.. నిన్నటి రోజున గుంటూరు సబ్ జైల్లో బాపట్ల మాజీ సీఎం నందిగాం సురేష్ ను పరామర్శించడానికి వెళ్లిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిన్నటి రోజున మీడియాతో మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ టిడిపి నేతలకు మాస్ వార్నింగ్ ఇచ్చినట్లుగా కొన్ని వీడియోలు వైరల్ గా మారుతున్నాయి.


నిన్నటి రోజున ఉదయం తాడేపల్లి నివాసం నుంచి నేరుగా గుంటూరులో ఉండే  జైలుకు వెళ్లి నరేష్ ను కలవడం జరిగింది. ఆ పర్యటన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఒక దళిత నాయకుడిని అరెస్టు చేయడం ఇంతకంటే నీచమైన రాజకీయం ఉండదు అంటూ ఇదంతా అక్రమ అరెస్టు అంటూ తెలియజేశారు. ఏపీ సీఎం చంద్రబాబు ప్రతిపక్షాల పైన ఇలాంటి తప్పులు కేసులు పెట్టడం ఆయనకు ఆనవాయితీగా మారిపోయింది అంటూ విమర్శించారు. వైసీపీ నేతలకు కార్యకర్తలకు పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా తాను మరొకసారి ఇస్తున్నానని తెలిపారు.



ఇంకా తాను అధికారంలోకి రాగానే మిత్రపక్ష నాయకులను కూడా ఇదే జైలులో వేయిస్తాను అంటూ జగన్ ఫైర్ అయ్యారు.. రెండు బుక్ మీరే కాదు ఎవరైనా మైంటైన్ చేయొచ్చు అంటు తెలిపారు తాము కూడా అధికారంలోకి వస్తే అదే బుక్ ని మెయింటైన్ చేస్తాం ఎవరిని కూడా వదలమంటూ తీవ్రస్థాయిలో జగన్ ఫైర్ అయ్యారు. విడుదల రజినీ తో పాటు గుంటూరు కు చేరుకొని అక్కడ నందిగామ సురేష్ ను పలకరించి మళ్ళీ జైలు బయటే వార్నింగ్ ఇచ్చారు. మొదట ఇలాంటి తప్పుడు సాంప్రదాయానికి నాంది పలికింది మీరే అంటూ ఫైర్ అయ్యారు జగన్. వరద బాధితులను ఆదుకోకుండా ప్రతిపక్ష నేతల మీదే ఇలాంటి పనులు చేస్తున్నారనే విధంగా రాజకీయం జగన్ ఫైర్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: