-మొదటి నెలలో 7000..
-తర్వాత ప్రతి నెలా 4000..
- మాట నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం

 నారా చంద్రబాబు నాయుడు..  ఈయన పేరు చెబితే దేశవ్యాప్తంగా తెలియని వారు ఉండరు. కేవలం రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా దేశ రాజకీయాల్లో కూడా కీలకమైన నాయకుడిగా ఎదిగారు. అలాంటి చంద్రబాబు నాయుడు రాజకీయాలను అర్థం చేసుకోవడం ఎవరివల్లా కాదు. ఏదైనా వ్యూహం రచించారంటే అది నెరవేరేవరకు అలు పెరగని శ్రమ చేస్తాడు. అలా రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ అంటే చంద్రబాబు పేరు చెప్పుకోవచ్చు. 2024 ఎన్నికల్లో ఏపీలో  సంచలమైన విజయాన్ని సాధించి  అదరహో అనిపించాడు. కనీసం ప్రతిపక్ష పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశాడంటే చంద్రబాబు వ్యూహాలు ఏ విధంగా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. అలాంటి చంద్రబాబు నాయుడు కేవలం ఏపీలో అధికారంలోకి రావడమే కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో కూడా కీలకంగా మారాడు. ఈయన చెప్పిందే కేంద్రంలో వేదంలా మారింది. అలాంటి సీనియర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం పింఛన్ల పెంపు చేసి ప్రతినెల ఒకటో తేదీ వరకు పేద ప్రజలకు పింఛన్లు వేసి పేదల దేవుడయ్యారు. మరి పింఛన్ ఎంత పెంచాడు..ఆ వివరాలు ఏంటో చూద్దాం.

 7000 నుంచి 4000:
 కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే మొదటి నెల జూలై 1వ తేదీన 7వేల పెన్షన్  ప్రజల ఖాతాలో జమ చేశారు.  అంతేకాకుండా కొత్త పాస్ పుస్తకాలను కూడా మంజూరు చేశాడు. అయితే ఎన్నికలకు ముందు టిడిపి కూటమి ఇచ్చిన మాట ప్రకారం వృద్ధాప్య పెన్షన్ 3000 నుంచి 4 వేల వరకు అందిస్తామని చెప్పి ప్రతి నెల 4000 వారి ఖాతాలో జమ చేస్తున్నారు. అంతే కాకుండా ఏప్రిల్ నెల నుంచి పెంచిన పింఛన్ అమల్లోకి తీసుకొచ్చి ఆ డబ్బులను జూలై 1వ తేదీన ప్రతి ఒక్కరికి ₹7,000 వృద్ధాప్య పెంచిన అందించి ఆ తర్వాతి నెల నుంచి 4000 వేల రూపాయలను అందిస్తూ వస్తున్నారు. అంతేకాకుండా దివ్యాంగులకు 6000  కూడా అమలు చేశాడు. రాష్ట్రవ్యాప్తంగా 65.30 లక్షల మంది  పింఛన్ దారులు ఉన్నారు. దీనికోసం ప్రతి నెల ప్రభుత్వం  1939 కోట్లు చెల్లింపులు చేస్తోంది.  


ఇక పెరిగిన పింఛన్ల ద్వారా దాదాపు నెలకు 2,800 కోట్ల రూపాయలను ఖర్చు పెడుతున్నారు. ఇక వీళ్ళకే కాకుండా సికేడియు డయాలసిస్, తల సేమియా, సికిల్ సెల్ డిసీస్, హిమోపోలియో వ్యాధిగ్రస్తులకు నెలకు పదివేల రూపాయలు అందిస్తోంది. ఇవే కాకుండా సైనిక్ వెల్ఫేర్ పెన్షన్ భూములు కోల్పోయిన అమరావతి పేదలకు కూడా 5000 తో పాటు 550 రూ. అందిస్తున్నది.  ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు కూడా 50 ఏళ్లకే పింఛన్ అమలు చేస్తానని మేనిఫెస్టోలో ప్రకటించారు. దానిపై కూడా కసరత్తులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ విధంగా అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచే  పేద ప్రజలకు పెన్షన్లు అందిస్తూ పేదల దేవుడయ్యారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు..

మరింత సమాచారం తెలుసుకోండి: