- మాట తప్పని మడమ తిప్పని నాయకుడు..
- ప్రభుత్వ ఉద్యోగులకు ఆపన్న హస్తం..
- ఏపీలో ఎదురులేని నాయకుడు..


 ఇండియాలో తెలుగు రాష్ట్రాలకు అత్యధిక సార్లు సీఎంగా చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే చాలామందికి గుర్తుకు వచ్చేది చంద్రబాబు నాయుడు అని చెప్పవచ్చు.  వరుసగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాలుగుసార్లు సీఎంగా చంద్రబాబు సేవలందిస్తున్నారు. అలాంటి ఈయన రాజకీయాల్లోకి వచ్చి 50 సంవత్సరాలు  కావస్తోంది. ఓడిన గెలిచిన పేద ప్రజల పక్షన ఉంటూ, పార్టీని కాపాడుకుంటూ నాయకులకు అండదండగా ఉంటూ వస్తున్నాడు చంద్రబాబు నాయుడు.  అలాంటి చంద్రబాబు ఎలాంటి పని చేసిన అది భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ఆయన ఎప్పటికప్పుడు ప్రజలను నమ్మించడం కోసం పనులు చేయరు. ఆయన ఏ పని చేసిన భవిష్యత్తులో ఎంతో మందికి ఉపయోగపడుతుంది దానివల్ల ఎంతో మంది లాభపడతారు అని ఆలోచన చేసి ఏ పనైనా మొదలు పెడతారు.


చంద్రబాబు అంతటి ఆలోచనతో ఉన్నాడు కాబట్టి ఈరోజు హైదరాబాద్ అంత డెవలప్ అయింది.  ఆయన హయాంలోనే ఐటి శాఖ పుంజుకుంది. ఇప్పటికీ ఐటి హైదరాబాదులో అంతా ఎదిగింది అంటే అది చంద్రబాబు చలవే అని చెప్పవచ్చు. ఈ విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ పని చేసిన భవిష్యత్తు తరాలకు లైఫ్ ఇచ్చే విధంగా ఉంటుందని చెప్పకనే చెప్పవచ్చు.  ఈయన పాలనలో తప్పనిసరిగా ప్రభుత్వ ఉద్యోగులు టైం ప్రకారం పని చేయాల్సి ఉంటుంది.  కరప్షన్ అనే పదానికి ఆమడ దూరంలో ప్రభుత్వ ఉద్యోగులు ఉండేలా పాలన చేస్తారు. ఆ విధంగా చంద్రబాబు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే బెనిఫిట్స్ అన్ని అందిస్తూ  ఉద్యోగుల పాలిట వరంగా మారాడు.

 ఒకటో తేదీన జీతాలు:
 వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు  ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చాలా ఇబ్బంది అయ్యేది. నాలుగు సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగులు జీతాల కోసం ప్రతి నెల ఎదురు చూసే పరిస్థితి ఏర్పడేది.  కనీసం 7 నుంచి 15వ తేదీ వరకు కూడా ఒక్కోసారి జీతాలు పడేవి కావట. ఇక రిటైర్డ్ అయి పెన్షన్ తీసుకున్న వారి పరిస్థితి మరీ దారుణం. వారికి ఎప్పుడూ జీతాలు పడతాయో అసలు తెలియని పరిస్థితిలో బిక్కుబిక్కుమంటూ బ్రతికేవారు. అలాంటి దానికి చంద్రబాబు నాయుడు చరమగీతం పాడారు. ప్రతి నెల  ఒకటో తేదీన ప్రతి ఒక్కరి ఫోన్ లో బ్యాంకు మెసేజ్ లు టింగ్ టింగ్ మని మోగాల్సిందే. అయితే జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతివారం ప్రభుత్వానికి కోట్ల రూపాయలు ఆదాయం వచ్చినా కానీ ఇలా వచ్చేసరికి కనీసం ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు అందించేవారు కాదు. ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లకు జీతాలు అందించాలంటే నెలకి దాదాపు 6000 కోట్లు ఖర్చు అవుతాయి. జగన్ ప్రభుత్వంలో వారానికి 13 వేల కోట్లు  ప్రభుత్వానికి సమకూరిన కానీ,  మరిన్ని అప్పులు చేసి సమయానికి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు అందించేవారు. ఈ విషయాన్ని చంద్రబాబు చాలాసార్లు ప్రశ్నించారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగులంతా ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికే మొగ్గుచూపడంతో టిడిపి కూటమి  అధికారంలోకి వచ్చింది. ఇక చంద్రబాబు కూడా ఎన్నికలకు ముందు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీలన్నింటి నెరవేరుస్తూ, జీతాలను ప్రతి నెల ఒకటో తేదీన వేస్తూ వస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: