•జగన్ తప్పులను ఇప్పుడు పునరావృతం చేస్తున్న బాబు..

•రాష్ట్ర విభజన తర్వాత అప్పుల ఊబిలో ఆంధ్ర..

•ఆర్థిక మిగులు దేవుడెరుగు..

(ఆంధ్రప్రదేశ్ - ఇండియా హెరాల్డ్ )

2024 ఎన్నికలలో భాగంగా అధికారంలోకి రావాలనుకున్న టిడిపి ఒంటరిగా పోరాడలేక అటు బిజెపి , ఇటు జనసేనతో చేతులు కలిపి కూటమిగా ఏర్పడి పోటీ చేసింది. మరొకవైపు వైసీపీ పార్టీ సింగిల్ గానే పోరాడుతూ 175 స్థానాలలో పోటీ చేయగా. 45 శాతం ఓట్లు వైసీపీకి వచ్చినప్పటికీ కేవలం అతి తక్కువ ఓట్ల తేడాతో డిపాజిట్లు కోల్పోయారు. 175 స్థానాల్లో పోటీ చేస్తే కేవలం 11 స్థానాలకే సరి పెట్టుకోవాల్సి వచ్చింది. దీనికి కారణం సంక్షేమ పథకాలు అని, ఆంధ్ర అభివృద్ధి కనిపించడం లేదని జగన్ పరిపాలనలో నష్టపోయిన ప్రజలతోపాటు  ప్రత్యర్థి పార్టీలు చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.

2019 ఎన్నికలలో 175 స్థానాలలో పోటీ చేసి ఏకంగా 151 స్థానాలను సింగిల్ హ్యాండ్ తో కైవసం చేసుకున్న జగన్మోహన్ రెడ్డి,  ఆ విజయానికి కారణం సంక్షేమ పథకాలని చెప్పుకొచ్చారు. ఇక ఆ పథకాలను అమలు చేయడంలో 99% సక్సెస్ అయ్యారు కూడా.బడుగు బలహీన వర్గాలను ఆదుకునే దిశగా నవరత్నాలు పేరిట తీసుకొచ్చిన ఈ పథకాలు ప్రజలకు మంచి చేకూర్చాయి కానీ ఒక వర్గం ప్రజలు మాత్రం పూర్తిగా నష్టపోయారు. కేవలం బడుగు బలహీన వర్గాలను మాత్రమే పట్టించుకున్నాడని, మిగతా వారిని లెక్కచేయలేదు అనే వాదన వినిపించింది.  పైగా ఈ సంక్షేమ పథకాల కోసం వేల కోట్ల రూపాయలను ఖర్చు చేశారు జగన్మోహన్ రెడ్డి. దీంతో రాష్ట్రం మళ్ళీ అప్పుల్లో కూరుకుపోయింది.

నిజానికి రాష్ట్ర విభజన తరువాత నుంచి ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఉందని చెప్పవచ్చు. మిగులు బడ్జెట్ అనేది ఒక తీరని కలగా మిగిలిపోయింది. 2014 నుంచి రాష్ట్రం అప్పులో కూరుకుపోతోంది. నాడు ఐదేళ్లు , మధ్యలో జగన్ ఐదేళ్లు పరిపాలించాక ఇప్పుడు మళ్లీ చంద్రబాబు ఐదేళ్లు పరిపాలించనున్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు నెలలు పూర్తయింది. అయితే అప్పులు మాత్రం అర లక్ష కోట్లకు చేరుకుంది. ఎన్నికల ప్రచారంలో జగన్ రాష్ట్రాన్ని తాకట్టుపెట్టి అప్పుల ఊబిలోకి నెట్టాడు అంటూ నేడు అధికారంలో ఉన్న నాయకులు నాడు ప్రచారం చేశారు. అయితే ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చాక కూడా అదే ఒరవడి కొనసాగిస్తూ ఉండడం గమనార్హం.

ఇటీవల అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అప్పుల మీద అప్పులు చేస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అమలులోకి రాకముందే అప్పులు అప్పుడే రూ.43 కోట్లకు చేరిపోయాయి. కేవలం మూడు నెలల్లోనే ఇంత అప్పు చేయడం అంటే అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. వచ్చే ఆదాయం కంటే ఖర్చులు రెట్టింపు స్థాయిలో ఉండడంతో ఆర్థిక లోటు మరింత పెరిగిపోతుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఇప్పటివరకు ఒక్క పెన్షన్ల పెంపు తప్ప ఏ పథకం కూడా ఇంకా అమలు చేసినట్లు కనిపించడం లేదు.. అయితే ఆదాయం మాత్రం  నీరు లా ఖర్చు అవుతుండగా అప్పులు మాత్రం గుట్టలా పెరిగిపోతున్నాయి. మూడు నెలల్లోనే  రూ.43 కోట్ల అప్పులు అయ్యాయి. వివిధ మార్గాల ద్వారా రూ.44, 822 కోట్ల ఆదాయం వస్తే , ఖర్చులు మాత్రం రూ.87,282 కోట్లు ఉంది . ఆర్థిక లోటు 83.92 శాతానికి చేరుకుంది అని చెప్పవచ్చు. ఎన్నికలకు ముందు సంపద సృష్టిస్తామని చెప్పిన చంద్రబాబు నేడు ఇలా చేస్తూ ఉండడంపై ఒక వర్గం ప్రజల నుండి ఆగ్రహం వ్యక్తం అవుతోంది. మొత్తానికి అయితే నాడు జగన్ చేసిన తప్పు మళ్ళీ నేడు చంద్రబాబు చేస్తున్నారేమో అనే వాదన కూడా తెరపైకి రావడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: