ఏపీలో కూటమి పాలనలో ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది. ఎన్నికల సమయంలో వైసీపీ హయాంలో చేసిన అప్పులను కూటమి నేతలు ప్రధానంగా ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత  ప్రధాన రంగాలపై శ్వేత పత్రాలు విడుదల చేశారు. ఆర్థికంగా రాష్ట్రం కష్టాల్లో ఉందని ప్రతి సందర్భంలోనూ చెబుతున్నారు. దీంతో కూటమి ప్రభుత్వం ఆర్థిక నిర్వహణపై కూడా చర్చ జరుగుతోంది.


కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన నాలుగు నెలల కాలంలో చేసిన అప్పు రూ.43 వేల కోట్లకు చేరింది. జూన్ 12న కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఈ నాలుగు నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.43 వేల కోట్లకు పైగా అప్పు చేసింది. ద్రవ్య,  ఆదాయ లోటు కూడా భారీగానే రికార్డయింది. ఈ మేరకు ప్రధాన గణాంకాధికారి కార్యాలయం తాజాగా నివేదికను విడుదల చేసింది. 



ఈ నివేదిక ప్రకారం.. అప్పులు కాకుండా.. పన్నులు ఇతర ఆదాయ మార్గాల ద్వారా ఏప్రిల్ నుంచి జులై వరకు రూ.44,822 కోట్లు ఖజానాకు చేరింది. ఇందులో జీఎస్టీ, భూములపై ఆదాయం, పన్నులు, కేంద్ర పన్నుల్లో వాటా, కేంద్రం ఇచ్చిన గ్రాంట్లు వంటివి కలిపి రూ.41 వేల కోట్ల వరకు ఉంది. రాష్ట్ర అవసరాలకు ఈ మొత్తం చాలకపోవడంతో రుణాల ద్వారా రూ.43058 కోట్లు సమకూర్చుకున్నారు. నెలకు రూ. 11 వేల కోట్ల మేర అప్పులు చేసినట్లు నివేదికలో పేర్కొన్నారు. అయితే రూ.87282 కోట్ల మేర ఖర్చులయ్యాయి.


ఆదాయానికి, వ్యయానికి మధ్య అంతరాన్ని రుణాలతోనే భర్తీ చేయాల్సి వచ్చిందని నివేదికలో పేర్కొన్నారు. ఈ అంతరం కారణంగానే లోటు కూడా గణనీయంగా నమోదైనట్లు తేలింది. రూ.40234 కోట్లు రికార్డు కాగా,, ద్రవ్యలోటు రూ.83.92 శాతంతో రూ.42850 కోట్లకు చేరుకున్నట్లు తేలింది.  అయితే మొత్తం ఖర్చు రూ.87282 కోట్లలో రూ.85,056 కోట్లం వరకు రెవెన్యూ వ్యయమే ఉండటం గమనార్హం. అలాగే  మొత్తం వ్యయంలో సేవా రంగానికే రూ.49 వేల కోట్ల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: