విషయంలోకి వెళితే... వరుడు కావాలని అంటూ ఓ పోస్ట్ చేసిన మహిళ BEd డిగ్రీ పూర్తి చేసింది. ఉద్యోగం చేస్తూ సంవత్సరానికి గాను రూ. 1.3 లక్షలు సంపాదిస్తోంది. మొదటి భర్తతో వివాదాలు ఏర్పడి, విడాకులు తీసుకుంది. అయితే ఇప్పుడు ఆ మహిళ రెండో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయింది. అందుకోసం వరుడు కావాలంటూ ఆన్ లైన్ లో ఓ ప్రకటన ఇస్తూ... అందులో తన గొంతెమ్మ కోర్కెల లిస్ట్ ఒకటి ఇచ్చింది. ఆ లిస్ట్ చూసిన బ్రహ్మ చారులు మాకు పెళ్లే వద్దని మొత్తుకుంటున్నారు.
ఆ వివరాల్లోకి వెళితే, తనకు కాబోయే వరుడు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయ్యి ఉండాలట. అది కాకుంటే, MBA, MS చేసి కనీసం సంవత్సరానికి రూ. 30 లక్షల వార్షిక వేతనం కలిగి ఉండాలట. ఇక ఆ యువకుడు భారతదేశం, యుఎస్ లేదా యూరప్‌లో పని చేసి ఉండాలట. రూ. 30 లక్షలు సంగతి పక్కనబెడితే అతనికి తల్లిదండ్రులు ఉండకూడదట.. ఒకవేళ అతనికి తల్లిదండ్రులు ఉంటే, పెళ్లి తర్వాత అతనితో తల్లిదండ్రులు జీవించకూడదు అనే షరతులు పెట్టింది. అక్కడితో ఆగలేదండి బాబు... ఉండడానికి సొంతంగా 3 bhk ఇల్లు, ఇంటి పనులు చేయడానికి ఎప్పుడూ ఒక పని మనిషి అందుబాటులో ఉండాలి అని పేర్కొంది. దాంతో నెటిజన్లు ఈ రోజుల్లో పెళ్లి అనేది వ్యాపార ఒప్పందంలా మారిపోయిందని వాపోతున్నారు.