వైసీపీ అధినేత జగన్‌ మోహన్‌ రెడ్డికి మరో ఎదురు దెబ్బ తగిలింది. వైసీపీ అధినేత జగన్‌ మోహన్‌ రెడ్డికి బిగ్‌ షాక్‌ ఇచ్చారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. ప్రకాశం జిల్లా వైసీపీలో కలకలం నెలకొంది. వైసీపీ అధినేత జగన్ పై...వైసీపీ పార్టీ కీలక నేత బాలినేని శ్రీనివాసరెడ్డి అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం అందుతోంది. బుధవారం రాత్రి తాడేపల్లిలో వైఎస్ జగన్ తో భేటీ అయ్యారు వైసీపీ పార్టీ కీలక నేత బాలినేని శ్రీనివాసరెడ్డి.


జిల్లా అధ్యక్ష భాద్యతలు స్వీకరించి పార్టీని బలోపేతం చేయాలని ఈ సందర్భంగా  వైసీపీ పార్టీ కీలక నేత బాలినేని శ్రీనివాసరెడ్డిని కోరారట వైఎస్ జగన్. అయితే.. ఈ విషయంలో బాలినేని శ్రీనివాసరెడ్డి విముఖత చూపించారట. జగన్‌ మోహన్‌ రెడ్డి ఆఫర్‌ ను తిరస్కరించారట.  తనకు అధ్యక్ష భాద్యతలు స్వీకరించే ఉద్దేశ్యం లేదని వైసీపీ అధినేత జగన్‌ మోహన్‌ రెడ్డికి స్పష్టం చేశారు బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి.


ఈవీఎంల వ్యవహారంలో పార్టీ అధిష్టానం సహకరించలేదని వైసీపీ అధినేత జగన్‌ మోహన్‌ రెడ్డి ఎదుట అసంతృప్తి వ్యక్తం చేశారట బాలినేని శ్రీనివాసరెడ్డి.  గత కొంత కాలంగా వైసీపీ అధిష్టానం తనకు సహకరించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు బాలినేని శ్రీనివాసరెడ్డి. ఇక పలు అంశాల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి, జగన్‌ మోహన్‌ రెడ్డి ఇద్దరి మధ్య కుదరలేదట ఏకాభిప్రాయం.


దీంతో తిరిగి హైదరాబాద్ వెళ్లి పోయారట వైసీపీ పార్టీ కీలక నేత బాలినేని శ్రీనివాసరెడ్డి. అటు.. వైసీపీ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారట వైసీపీ పార్టీ కీలక నేత బాలినేని శ్రీనివాసరెడ్డి. ఈ మేరకు తన అనుచరులతో కూడా దీనిపై చర్చించారట. దీంతో.. వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తారని బాలినేని శ్రీనివాసరెడ్డి వర్గీయులు అంటున్నారు. మరి అటు వైసీపీ అధినేత జగన్‌ మోహన్‌ రెడ్డి దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: