అదే మాటను నిజం చేసాడు ఆ వ్యక్తి. కేవలం 2 గంటల, 41 నిమిషాల, 31 సెకన్లలో హైదరాబాద్ కారిడార్‌లలోని మొత్తం 57 మెట్రో స్టేషన్‌లను శశాంక్ సందర్శించి ఔరా అనిపించాడు. దాంతో గిన్నిస్ రికార్డుని జేబులో వేసుకొని పోయాడు. దాంతో ఈ రికార్డును కలిగి ఉన్న మొదటి వ్యక్తిగా రికార్డు సొంతం చేసుకున్నాడు. ఢిల్లీ మెట్రో స్టేషన్‌లలో అత్యంత వేగంగా ప్రయాణించిన వ్యక్తిగా గతంలో కూడా ఇతనిపై ఓ రికార్డు ఉంది. అవును, ఈ ఏడాది జనవరిలో ఢిల్లీ మెట్రో రైలు స్టేషన్లన్నింటినీ 15 గంటల 22 నిమిషాల్లో ప్రయాణించాడు మరి. కాగా ప్రజా రవాణాను ప్రోత్సహించేందుకు శశాంక్ మను మెట్రో నగరాల్లో ఇలా ప్రయాణాలు చేస్తున్నారు అని సమాచారం.
ఇక ఈ ఘనతని సాధించడంపట్ల శశాంక్ మాట్లాడుతూ.. "నాకు మెట్రో రైలు అంటే ఎంతో ఇష్టం. ఇది పట్టణ ప్రజా రవాణాను ప్రోత్సహించే ప్రయత్నం మాత్రమే. హైదరాబాద్ మెట్రో రైలు నెట్‌వర్క్‌లోని అన్ని స్టేషన్‌లను ఒకే మారథాన్ ట్రిప్‌లో ప్రయాణించడానికి నాకు మొత్తం 2 గంటల 41 నిమిషాల 31 సెకన్ల సమయం పట్టింది." అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే హైదరాబాద్ మెట్రో రైలు నెట్‌వర్క్ మొత్తం 3 కారిడార్‌ల మీదుగా దాదాపు 69.2 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. మియాపూర్ నుంచి ఎల్బీ నగర్, జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్, నాగోల్ నుంచి రాయదుర్గం వరకు మొత్తం 3 కారిడర్లలో మెట్రో సేవలు అందిస్తోంది.
కాగా సుదీర్ఘకాలం పాటు మెట్రో నెట్‌వర్క్‌లో ప్రయాణించడానికి శశాంక్ ‘సూపర్ సేవర్ హాలిడే కార్డ్’ని కొనుగోలు చేశాడు. ఇది హైదరాబాద్ మెట్రో నెట్‌వర్క్‌లో కూడా నిర్దిష్ట రోజులలో అన్‌లిమిటెడ్ రైడ్ సదుపాయం కల్పిస్తుంది. శశాంక్ ఈ విధంగా గిన్నిస్ రికార్డును సొంతం చేసుకునే ప్రయత్నించడం మరో కారణం కూడా ఉందట. సిటీలలో నివసించేవారు సొంత వాహనాలకు బదులు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌కి మారేలా చేయడమే తన ఈ ప్రయత్నమని చెప్పుకొస్తున్నాడు. ఎందుకంటే, తద్వారా వాతావరణ కాలుష్యం కొంతమేర అయినా తగ్గుతుందని. నిజంగా సూపర్ కదూ!