వైసీపీ అధినేత మరో కీలక నేతతో ములాఖత్ అయ్యారు. పార్టీలో యువనేత ఎస్పీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు, మాజీ ఎంపీ నందిగం సురేశ్ ను జగన్ గుంటూరు జైలులో పరామర్శించారు.  మాజీ ఎంపీని ములాఖత్ ద్వారా మాట్లాడారు. ఇదిలా ఉండగా.. గతంలో అంతకు ముందు నెల్లూరు వెళ్లి ఈవీఎం మిషన్ బద్దలు కొట్టారన్న వివాదంలో జైలులో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ని కూడా ములాఖత్ ద్వారానే జగన్ పరామర్శించారు.


అయితే జగన్ ములాఖత్ ల పరామర్శల లిస్ట్ చాలానే ఉందని అంటున్నారు టీడీపీ నాయకులు. కూటమి ప్రభుత్వం వరుస పెట్టి వైసీపీ నేతలను అరెస్టు చేయిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో తమను ఇబ్బంది పెట్టిన నేతలను జైలు గోడలకు పరిమితం చేస్తోంది.  ఈ నేపథ్యంలో జగన్ వారికి భరోసా ఇచ్చేందుకు ములాఖత్ లను చేపడుతున్నారు. అయితే ఇదే పని జగన్ మీద ఉండాల్సి వస్తుందా అనే సెటైర్లు కూడా వినిపిస్తున్నాయి.


ఎందుకంటే టీడీపీ వేట మొదలు పెట్టింది. వైసీపీ నేతలు మీద వరసగా కేసులు పెడుతోంది. అలాగే పాత కేసులను తిరగతోడుతోంది. దాంతో వైసీపీ నేతలు కొందరు అజ్ఞాతంలోకి వెళ్తున్నారు. మరి కొందరు సుప్రీం కోర్టు వరకు వెళ్లి స్టే లు, బెయిళ్లు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే నిందితులను జైలు గోడల మధ్య కలుసుకొని ములాఖత్ జరపడం వల్ల విమర్శలు సైతం వస్తున్నాయి.


పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం మిషన్ ను పగులగొట్టడం సమర్థించారా అని అప్పుడు టీడీపీ సహా మిగతా పార్టీలన్నీ ప్రశ్నించాయి. ఇప్పుడు టీడీపీ ఆఫీసు మీద దాడి కేసులో నందిగం సురేశ్‌ ని అరెస్టు చేస్తే ఆయన్ను జగన్ పరామర్శించడం ఎంత వరకు సమంజసం అని విమర్శిస్తున్నారు. ఓ వైపు బెజవాడ ముంపునకు గురవుతుంటే.. లక్షలాది మంది నిరాశ్రయులు అయితే వారిని పరామర్శించకుండా ములాఖత్ ద్వారా వైసీపీ నేతల్ని కలుసుకొని.. ప్రభుత్వంపై విమర్శలు చేయడాన్ని రాజకీయ విశ్లేషకులు తప్పు పడుతున్నారు. ఇది ప్రజల్లో తప్పుడు సంకేతాలను తీసుకెళ్తాయి అని హెచ్చరిస్తున్నారు. ఫలితంగా పార్టీ గ్రాఫ్ దెబ్బతినే అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: