`వ‌ర‌ద చుట్టుముట్టిన త‌ర్వాత‌.. రాజ‌మండ్రి నుంచి విజ‌య‌వాడ‌కు రావాల్సిన నాయ‌కులు.. బైపాస్ మీదుగా గుంటూరుకు వెళ్లిపోయారు. అక్క‌డ నుంచి ప్ర‌కాశం జిల్లాకు  వెళ్లిపోయారు. ప‌రిస్థితి ఏంటి? ఏం జ‌రిగింది?`- ఇదీ.. బీజేపీ సీనియ‌ర్ నాయకుల మ‌ధ్య జ‌రిగిన కీల‌క సంభాష‌ణ‌. దీంతో బీజేపీలో అస‌లు ఏం జ‌రిగింది? ఎందుకు ఈ చ‌ర్చ వ‌చ్చింది? అనేది ఆస‌క్తిగా మారింది. ఎందుకంటే.. విజ‌య‌వాడ‌ను ప‌రామ‌ర్శించే విష‌యంలో బీజేపీ నేత‌లు వంతులు వేసుకున్నార‌ట‌.


ఎవ‌రికి వారు.. త‌మ‌కు క్రెడిట్ కావాలంటే.. త‌మ‌కుకావాల‌ని.. కొంద‌రు నేత‌లు ప్ర‌య‌త్నించార‌న్న‌ది ఇప్పు డు సీనియ‌ర్ల మ‌ధ్య జ‌రుగుతున్న చ‌ర్చ‌. త్వ‌ర‌లోనే బీజేపీకి సంబంధించి ఏపీలో ఏం చేశార‌న్న విషయం పై పార్టీ అధిష్టానానికి నివేదిక ఇవ్వాల్సి ఉండ‌డంతో ఈ త‌ర‌హా వ‌చ్చ ఇప్పుడు తెర‌మీదికి వ‌చ్చింది. ఎవ రు ఏం చేశారు? అనేది రాష్ట్ర పార్టీ చీఫ్ పురందేశ్వ‌రి స్వ‌యంగా ఇవ్వాల్సి ఉంది. దీనికి సంబంధించి ఆమె మౌనంగా ఉన్నారు. పైగా.. ఒక‌రిద్ద‌రు త‌ప్ప ఎవ‌రూ ముందుకు రాలేదు.


మ‌రీ ముఖ్యంగా ఇద్ద‌రు కీల‌క నేత‌లు, ఆర్ ఎస్ ఎస్‌తో సంబంధాలు ఉన్న నాయ‌కులు.. విజ‌య‌వాడ‌కు బ‌య‌లు దేరారు. వీరిద్ద‌రూ కూడ‌బ‌లుక్కుని రాజ‌మండ్రి నుంచి విజ‌య‌వాడ‌కు చేరుకున్నారు. కానీ, ఆ స‌మ‌యంలో పురందేశ్వ‌రి క్షేత్ర‌స్థాయిలో ఉన్నార‌ని తెలుసుకుని.. వారు అటు నుంచి అటే గుంటూరుకు వెళ్లిపోయార‌ట‌. అయితే.. అక్క‌డ కూడా ఉండ‌కుండా.. ప్ర‌కాశం జిల్లాకు చెందిన ఓ కీల‌క వైసీపీ నాయ‌కుడి కి వెళ్లార‌న్న‌ది స‌మాచారం.


ఈ విష‌యం సీనియ‌ర్ల వ‌రకు చేరింది. విజ‌య‌వాడ‌కు రాకుండా.. వారు ప్ర‌కాశం జిల్లాకు ఎందుకు వెళ్లా రు? ఆయ‌న‌తో వీరికి స‌న్నిహితంగా ఉండాల్సిన అవ‌స‌రం ఏంట‌న్న‌ది ప్ర‌శ్న‌. అదే స‌మ‌యంలో విజ‌య వాడ‌లో బాధితుల‌ను ప‌రామ‌ర్శించ‌కుండా.. అక్క‌డ ఏం చేశార‌న్న‌ది కూడా స‌స్పెన్స్‌గా మారింది. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలోనే బీజేపీలో అంత‌ర్గ‌తంగా ఆ ఇద్ద‌రు నేత‌ల‌పై చ‌ర్చ సాగుతోంది. దీంతో పురందేశ్వ‌రి త‌న నివేదిక‌ను ఎలా పంపిస్తార‌నేది చ‌ర్చ‌గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: