ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం జగన్ మోహన్ రెడ్డి పరిస్థితి అత్యంత దారుణంగా తయారయింది అన్న సంగతి తెలిసిందే. మొన్నటి ఎన్నికల్లో దారుణంగా ఓటమిపాలైంది వైసిపి పార్టీ. దీంతో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడిప్పుడే కోలు కుంటున్నాను. ఈ నేపథ్యంలోనే ఏపీని మొన్నటి వరకు వరదలు ముంచేశాయి. అయితే వారికి వైసీపీ పార్టీ అండదండలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. విరాళాలు ప్రకటించిన వైసిపి నేతలు.... వరద బాధితులను ఆదుకుంటున్నారు.


ఇప్పటికే విజయవాడ నగరంలో జగన్మోహన్ రెడ్డి పర్యటించి... బాధితులను ఆదుకునే ప్రయత్నం చేశారు.  ఇటు కృష్ణలంకను కాపాడింది జగన్మోహన్ రెడ్డి కట్టిన.. వాల్ అని మొన్నటి వరకు ప్రచారం జోరుగానే సాగింది. అయితే ఇలాంటి నేపథ్యంలో జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోటాను బద్దలు కొట్టేందుకు.. జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ అడ్డమైన పిఠాపురంలో అడుగు పెట్టబోతున్నారు జగన్మోహన్ రెడ్డి.


మొన్నటి వరదలకు పిఠాపురం నియోజకవర్గంలో కూడా.. భారీ స్థాయిలో జనాలు నష్టపోయారు. పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు అండగా ఉండేందుకు జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగుతున్నారు. ఇవాళ ఉదయం సమయంలో జగన్మోహన్ రెడ్డి పిఠాపురంలో పర్యటించబోతున్నారు.  పిఠాపురం నియోజకవర్గంలోని ఏలేరు వరద ఉధృతి.. బాధితులను.. ఆదుకోనున్నారు జగన్మోహన్ రెడ్డి.


ఇందులో భాగంగానే ఇవాళ ఉదయం 10 గంటల సమయంలో తాడేపల్లి నివాసం నుంచి బయలు దేరి 11 గంటల సమయంలో పిఠా పురంలో చేరుకుంటారు జగన్మోహన్ రెడ్డి. ఇక అక్కడ ఇసుకపల్లి మీదుగా మాధవపురం చేరుకోనున్నారు జగ న్మోహన్ రెడ్డి. ఇలా పిఠాపురం నియోజక వర్గంలో బాధితులు అందరినీ... కలిసి పరామర్శించనున్నారు.  అలాగే బాధితులకు ఆర్థిక సాయం చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి. అదే సమయంలో పవన్ కళ్యాణ్ పై కూడా విమర్శలు చేసే ఛాన్స్ ఉంది. మరి దీనిపై జనసేన పార్టీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: