- హైడ్రాతో అక్రమార్కుల భరతం..
- తెలుగు రాష్ట్రాల్లో సీఎం రేవంత్ రెడ్డికి ప్రశంసల జల్లు..
రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి వన్ ఇయర్ కూడా గడవకముందే అద్భుతమైన పాలన అందిస్తున్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కుతంత్రాలు పన్నినా తాను అనుకున్న లక్ష్యం దిశగా ముందుకు వెళ్తున్నాడని చెప్పవచ్చు. తాను ఎన్నికలకు ముందు ఏదైతే చెప్పుకుంటూ వచ్చాడో ఎన్నికల్లో గెలిచిన తర్వాత అధిరోహించిన రేవంత్ రెడ్డి మాట తప్పకుండా మడమ తిప్పకుండా ప్రతి విషయాన్ని క్లియర్ గా గమనిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా చేయని సాహసాన్ని ఆయన చేసి చూపిస్తున్నారు. తాను అనుకున్న 6 గ్యారంటీలలో ఆల్మోస్ట్ 4 గ్యారంటీలు పూర్తిగా అమలు చేశాడు. వాటిని కూడా పూర్తి చేసేందుకు ముందుకు కదులుతున్నాడు. అలాంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వ భూములను కబ్జా చేసి అక్రమ కట్టడాలు కట్టిన వారిపై కొరడా జులిపిస్తున్నారు.. ప్రభుత్వ భూమి ఆక్రమించాలంటేనే గుండెల్లో రైలు పరుగెట్టెలా చేస్తున్నారు. అలాంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతో తీసుకువచ్చినటువంటి మహోత్తరఘట్టం సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతోంది. ఈ హైడ్రాలో ఎంతటి రాజకీయ ఘనులు పలుకుబడి ఉన్న వ్యక్తి ఉన్నా కానీ వెనక్కి తగ్గకుండా భూములను స్వాధీనం చేసుకున్న వారిపై పంజావిసురుతున్నారు అని చెప్పవచ్చు. హైడ్రా పేరుతో రేవంత్ రెడ్డి చేస్తున్న పనులపై మరికొన్ని వివరాలు చూద్దాం..
హైడ్రా పనులు అద్భుతం:
రేవంత్ సర్కార్ హైదరాబాద్ మహానగరంలో ఇప్పటివరకు చేపట్టినటివంటి హైడ్రా పనుల వల్ల కుంటలు, చెరువులు ప్రభుత్వ స్థలాల్లోని అక్రమ నిర్మాణాలు, చిట్టాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తాజాగా నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో ఇక రేవంత్ ఎవరిని వదిలిపెట్టరు అని మెసేజ్ బయటకు వెళ్ళింది. దీంతో కొంతమంది బఫర్ జోన్ లో ఉన్నటువంటి కట్టడాలను వారికి వారే కూల్చివేస్తున్నారు. ప్రముఖ నిర్మాత సినీ నటుడు మురళీమోహన్ జయభేరి కన్స్ట్రక్షన్ ను తనకు తానే కుల్చివేస్తానని చెప్పారు. అంతేకాకుండా మల్లారెడ్డి కూడా బఫర్ జోన్ లో ఉన్నటువంటి కట్టడాలను కూల్చివేస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా కెసిఆర్ కి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ లో ఇలా ఎంతో మంది బడా రాజకీయ నాయకులు చాలా చెరువులు,కుంటలు ఆక్రమించి అందులో అక్రమ కట్టడాలు కట్టారు. అందరికీ ఇప్పటికే ప్రభుత్వం నోటీసులు అందించింది. త్వరలో వాటిని కూడా కూల్చివేసే పనిలో హైడ్రా ఉంది. ఇక ఇప్పటివరకు హైడ్రా స్వాధీనం చేసుకున్నటువంటి భూమి వివరాలను చూస్తే .. 262 భవనాలు కూల్చివేశారు. ఇందులో 11 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఇవే కాకుండా పలు జిల్లాల్లో కూడా అక్రమార్కులపై అధికారులు ఉక్కు పాదం మోపి బఫర్ జోన్లో కట్టినటువంటి వారికి నోటీసులు పంపుతున్నారు. ఈ విధంగా హైడ్రా పేరుతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రేవంత్ రెడ్డి పేరు మారుమోగిపోతోంది. దీంతో ఏపీలో కూడా చంద్రబాబు అక్రమార్కుల భరతం పట్టాలని ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది.