విద్యార్థి నాయకుడిగా ఉన్న సమయంలో సీతారాం ఏచూరి చూపించిన తెగువ, పోరాట పటిమను కాంగ్రెస్ నేత గుర్తుచేశారు. ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీతో ఏచూరి ఉన్న ఫొటో వెనుక ఉన్న ఉద్దేశం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఎమర్జెన్సీ సమయంలో ఢిల్లీ జేఎన్‌యూకి ఇందిరాగాంధీ వైస్ ఛాన్సలర్‌గా ఉండేవారు. 1977లో జేఎన్‌యూలో ఏచూరి విద్యార్థి నాయకుడిగా ఉన్నారు. అదే సమయంలో ఏచూరి పెద్ద ఎత్తున విద్యార్థులను వెంట వేసుకుని ఇందిరాగాంధీ ఇంటిని ముట్టడించారు. విద్యార్థుల ఆందోళన చూసి ఆమె ఇంట్లో నుంచి బయటకు వచ్చారు. విద్యార్థులతో మాట్లాడుతుండగా డిమాండ్లు చెప్పాలని ఇందిర అడిగారు. ఆమె పక్కనే ఉన్న ఏచూరి ఛాన్సలర్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అప్పటికే ఇందిరాగాంధీ పవర్ ఫుల్ లేడీగా, ఐరన్ లేడీగా గుర్తింపు పొందారు. అలాంటిది ఆమె పక్కనే నిలబడి ఆమె రాజీనామాను కోరడం.. విద్యార్థి నాయకుడిగా అతడు చూపించిన తెగువను ఇప్పుడు గుర్తుచేసుకుంటున్నారు. ఎమర్జెన్సీ తర్వాత ఇందిరాగాంధీ అధికారం కోల్పోవల్సి వచ్చింది. అయినా కూడా ఆమె ఛాన్సలర్ పదవికి రిజైన్ చేయలేదు. అనంతరం కొద్దిరోజుల తర్వాత రాజీనామా సమర్పించారు.