ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిస్థితి.. చాలా దారుణంగా తయారయిందని చెప్పవచ్చు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో వైసిపి విజయం సాధిస్తుందని ఎన్నికల కంటే ముందు వీర్ర వీగారు జగన్మోహన్ రెడ్డి. కానీ ఫలితాలు వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డికి నిరాశ మిగిలింది. అత్యంత దారుణంగా 11 స్థానాలు మాత్రమే వైసిపి పార్టీ విజయం సాధించడం జరిగింది. దీంతో వైసిపి పార్టీ కీలక నేతలందరూ ఓడిపోయారు.


కేవలం మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి లాంటి పెద్ద లీడర్లు తప్ప... మిగతా బలమైన నాయకులు ఎవరు గెలవలేకపోయారు. దాదాపు మంత్రులందరూ ఓడిపోయారని చెప్పవచ్చు. అయితే ఇలాంటి నేపథ్యంలో వైసిపి పార్టీని రిపేర్ చేసేందుకు జగన్ మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ రిపేర్... చిత్తూరు జిల్లా నుంచి చేసేందుకు రంగం సిద్ధం చేశారట జగన్మోహన్ రెడ్డి.


ఇప్పటికే చాలామంది జిల్లా అధ్యక్షులను మార్చేసి ఎందుకు రంగం సిద్ధం చేశారంటే జగన్మోహన్ రెడ్డి. ఇందులో భాగంగానే అతి త్వరలోనే చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడి మార్పు ఉంటుందని సమాచారం.  ప్రస్తుతం చిత్తూరు జిల్లా అధ్యక్షులుగా .. కుప్పం వైసిపి అభ్యర్థి, ఎమ్మెల్సీ భరత్ అన్నారు. అయితే ఆయన పైన వేటు వేయాలని జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారట.  భరత్ పైన వేటు వేసి... పెద్దిరెడ్డి కుటుంబానికి ఆ బాధ్యతలు అప్పగించేందుకు రంగం సిద్ధం చేశారట.


చిత్తూరు జిల్లా వైసీపీ బాధ్యతలను మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించాలని అనుకుంటున్నారట. ఆయన అయితే జిల్లాను మళ్లీ ఫామ్ లోకి తీసుకు వస్తారని జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారట. ప్రస్తుతం అధ్యక్షులుగా ఉన్న... భరత్ అను కుప్పానికే పరిమితం చేయాలని జగన్ అనుకుంటున్నారట. మొత్తం 11 నియోజకవర్గాల బాధ్యతలను మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి మాత్రమే అప్పగించాలని జగన్ నిర్ణయం తీసుకున్నారట. ఆయన అడుగుజాడల్లో పార్టీ నేతలు అందరూ నడవాలని కూడా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారట. దీనిపై త్వరలోనే ప్రకటనలకు కూడా రానుందట.


మరింత సమాచారం తెలుసుకోండి: