2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి లెక్కకు మిక్కిలి కారణాలు ఉన్నాయి. నగరి నియోజకవర్గంలో సొంత పార్టీకి చెందిన కొంతమంది నేతలు రోజాకు వ్యతిరేకంగా పని చేయడంతో ఆమె ఓటమిపాలయ్యారు. ఎన్నికలు జరగడానికి ముందునుంచి రోజా ఈ ఎన్నికల్లో ఓటమిపాలు అవుతారని ప్రచారం జరగగా ఆ ప్రచారమే ఎట్టకేలకు నిజమైంది. వైసీపీలో ఉంటూ రోజా ఓటమికి కృషి చేసిన కేజే కుమార్ దంపతులపై వేటు పడింది.
 
చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు భరత్ నుంచి ఈ మేరకు ప్రకటన వెలువడింది. టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాశ్ విజయం కోసం కేజే కుమార్, కేజే శాంతి పని చేశారని తెలుస్తోంది. గతంలో కొన్ని కారణాల వల్ల జగన్ సైతం వాళ్లపై చర్యలు తీసుకోలేదు. వైసీపీకి దారుణ పరాజయం ఎదురైన నేపథ్యంలో పార్టీకి నష్టం చేసిన వాళ్లపై చర్యల దిశగా జగన్ అడుగులు పడుతున్నాయని సమాచారం అందుతోంది.
 
కేజే కుమార్, కేజే శాంతి పార్టీ ఆశయాలకు, పార్టీ సిద్దాంతాలకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని స్థానిక నాయకుల ద్వారా ఫిర్యాదు అందిందని వారిపై అభియోగాలు నిజమేనని ధృవీకరిస్తూ క్రమశిక్షణ కమిటీ సిఫారసు ప్రకారం వాళ్లను పార్టీ నుంచి తొలగిస్తూ పార్టీ సభ్యత్వాన్ని రద్దు పరచడమైనదని భరత్ రిలీజ్ చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మరి కొందరిపై కూడా వేటు పడే ఛాన్స్ అయితే ఉంది.
 
భరత్ రిలీజ్ చేసిన ప్రకటన రోజాకు సైతం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని తెలుస్తోంది. రోజా రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో పార్టీ పుంజుకోవడానికి కృషి చేస్తున్నారు. 2029 ఎన్నికల్లో మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచి సత్తా చాటాలని ఆమె భావిస్తున్నారు. రోజా సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తారని ప్రచారం జరిగినా ఆ ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని తేలిపోయింది. రోజా కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.




మరింత సమాచారం తెలుసుకోండి: