నాయకులను అధికారులను ప్రజలు ప్రశ్నించవచ్చు. అలాగే పొగడ్తలతో మెప్పించవచ్చు. కానీ రాష్ట్రంలో ఎలాంటి సమస్యలు లేకున్నప్పుడు ఇది చేయాల్సిన పని .. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి.. ముఖ్యంగా వరద ప్రభావిత ప్రాంతాలు ఇప్పటికీ ఇంకా కోలుకోలేని పరిస్థితి ఉన్నది. దీంతో రహదారులు కూడా చాలా దెబ్బతిన్నాయి. ప్రజల నివాసాలు కూడా చాలాచోట్ల దెబ్బతినడమే కాకుండా పంట నష్టం ఉండడానికి ఇల్లు తినడానికి తిండి నీరు లేకుండా పోయింది. దీంతో ప్రభుత్వం బాధితులకు ఎంత సహాయం చేస్తారో అంటూ ఇప్పటివరకు ఏ విధంగా తెలుపలేదు. ఏపీ సీఎం సహాయం పైన ప్రకటనలు చేస్తూ ఉన్న ఇప్పటివరకు మంత్రులు ఎలాంటి డబ్బులు లేవని చెబుతున్నారు.


అంతేకాకుండా ఏలేరు రిజర్వాయర్ వల్ల పిఠాపురం తో సహా కాకినాడలో సుమారుగా 65 గ్రామాలు నీట మునిగాయి. ఇలాంటి సమయంలో బిజెపి నేతలపైన ఏపీ ప్రజలు విమర్శలు చేస్తున్నారు.. బిజెపి నాయకురాలు అయిన పురందేశ్వరి విజయవాడలో మీటింగ్ జరపగా ఏపీ పరిస్థితుల పైన చర్చిస్తున్నారని అందరూ అనుకున్నారు.. అయితే కేవలం డెలిగేషన్ గా ఏర్పడి కేంద్రానికి నివేదిక ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే సాయం చేసేలా చూస్తామంటూ చెబుతున్నారు తప్ప చేస్తామని చెప్పలేదు.. కానీ ఈ సమావేశం మొత్తం కూడా మోదీ భజన చేయడమే సరిపోయిందట.


ప్రధాన మోడీ దేశంలోనే అన్ని వర్గాల ప్రజలను మేలుకోరే విధానం ఉన్నప్పటికీ..370 ఆర్టికల్ రద్దు, వక్స్ బోర్డు మార్పులు ఇతరత్రా అంశాలను మోదీ ధైర్యంగా అమలు చేశారు. అంతేకాకుండా ఎన్నడూ లేని విధంగా బిజెపి పార్టీకి ఏపీలో సీట్లు రావడంతో కచ్చితంగా ఇక మోడీ ఏపీ దశాదిశ మారుస్తారనుకున్నారు.. కానీ ఇప్పటివరకు ఎలాంటి ఆలోచనలు చేయలేదు బిజెపి. కేవలం అమరావతి రాజధాని నిర్మాణం కోసం అప్పుగా కొన్ని కోట్ల రూపాయలు ఇప్పిస్తున్నారు. ఎక్కడ కూడా విజయవాడ, బాపట్ల, గుంటూరు ,కాకినాడ ఇలా వరద బాధితుల గురించి ప్రస్తావన తీసుకురాలేదట.. కేంద్ర నుంచి వచ్చే సహాయం మీదకు కూడా ఏపీ మంత్రులు ఎవరూ కూడా నోరు విప్పడం లేదు.. దీంతో వరద బాధితులు కూడ ఏపీ మంత్రులు మోదీ భజన చేస్తున్న నిధులు ఇవ్వలేదంటూ విమర్శలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: