* అప్పుల కుప్పగా మారిన ఆంధ్రప్రదేశ్
* ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రాలకు వలసపోతున్న యువత..
* ఉచితాల మోజులో ప్రజలు.. అధికారం మోజులో నాయకులు.. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ఏమిటో..?
ప్రభుత్వ నిర్లక్ష్యం మూలంగా పెద్ద పెద్ద కంపెనీలు పక్క రాష్ట్రానికి తరళి పోతున్నాయి..పెట్టుబడులు పెట్టాలంటే సరైన కాపిటల్ సిటీ ఉండాలి.. మన రాష్ట్రానికి అంతటి అదృష్టం ఎక్కడిది.. జగన్ హయాంలో అమరావతి కాకుండా మూడు రాజధానులు నిర్మిస్తామని ప్రకటన చేసారు..పరిపాలన అంతా వైజాగ్ నుంచి జరుగుతుంది అని గత ముఖ్యమంత్రి జగన్ చాలా సార్లు చెప్పుకొచ్చారు. కానీ అది ప్రకటనకే పరిమితం అయింది.. రాష్ట్రంలో ప్రభుత్వం మారితే పరిస్థితి మారుతుంది అని అంతా భావించారు. దీనితో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.కూటమి ప్రభుత్వం వచ్చినా కూడా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి కలవరపెడుతుంది. ఉచిత పధకాలకే గత ప్రభుత్వం వేల కోట్లు అప్పుచేసి మరీ ఖర్చుచేసింది.. ఇప్పుడు ఆ అప్పులకు వడ్డీ చెల్లించుటకే రాష్ట్ర ఖజానా సరిపోవడం లేదు..మరి కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం అంతకంటే భారీ స్థాయిలో సూపర్ సిక్స్ అంటూ ఉచిత పధకాలను తీసుకొచ్చింది.. ఇప్పుడు ఆ పధకాల పరిస్థితి అగమ్యగోచరంగా వుంది..భవిష్యత్ లో అయిన రాష్ట్ర పరిస్థితి బాగుపడుతుందో లేదో చూడాలి..