ఏపీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంత ఘోరమా అనే కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత ప్రకటించిన పథకాలను శరవేగంగా అమలు చేయకపోవడానికి సైతం ఇదే కారణమని కామెంట్లు వినిపిస్తున్నాయి. పింఛన్ల పెంపు, అన్న క్యాంటీన్ల అమలు మినహా రాష్ట్రంలో చెప్పుకోదగ్గ స్థాయిలో అభివృద్ధి అయితే జరగడం లేదు.
ఏపీ ఆదాయం తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టడానికే సరిపోతుంది. అమరావతి అభివృద్ధి జరిగి రాష్ట్రానికి ఎక్కువ సంఖ్యలో కంపెనీలు వస్తే మాత్రమే ఈ పరిస్థితి మారే అవకాశాలు అయితే ఉంటాయి. చంద్రబాబు నాయుడు మాత్రం రాష్ట్రంలో సంపద సృష్టించి ఏపీని శరవేగంగా అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. రాష్ట్రంలో వరద బాధితులకు సహాయం చేయాలన్నా ఆర్థిక పరిస్థితి వల్ల కొంతమేర సహాయంతో సరిపెట్టాల్సి ఉంటుంది.
రాష్ట్ర విభజన తర్వాత ఏపీ అప్పులు మాత్రం ఊహించని స్థాయిలో పెరిగాయి. పథకాల అమలు కోసం పప్పూ బెల్లాల్లా డబ్బును ఖర్చు చేయడం కూడా ఈ పరిస్థితికి కారణమని చెప్పవచ్చు. రాబోయే రోజుల్లో అయినా ఈ పరిస్థితి మారాలని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఏపీ అప్పులు తగ్గితే రాష్ట్ర ప్రజలు ఎంతో సంతోషించే అవకాశాలు అయితే ఉంటాయి. రాబోయే రోజుల్లో అయినా ఏపీకి ఈ అప్పుల బాధ తగ్గుతుందేమో చూడాల్సి ఉంది. రాష్ట్ర అప్పులు తగ్గకపోతే ఏపీ అభివృద్ధి మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి.