* 6 గ్యారెంటీల పేరుతో అధికారంలోకి కాంగ్రెస్‌
* కేసీఆర్‌ అప్పులు చేసారని కాంగ్రెస్‌ ప్రచారం
* 6 గ్యారెంటీలు అమలు చేస్తే.. తెలంగాణ నాశనమేనా
* ఫ్రీ బస్సుతోనే తెలంగాణ ప్రజలు సంతృప్తి


భారత దేశంలోనే తెలంగాణ రాష్ట్రం... ఎంతో గొప్పదైనది. దీనికి ముఖ్య కారణం తెలంగాణలో హైదరాబాద్ ఉండటం. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమైన వనరు హైదరాబాద్ నగరం మాత్రమే. దేశ నలుమూలల నుంచి హైదరాబాదులో బతుకుతున్నారు జనాలు.  అయితే అలాంటి తెలంగాణ రాష్ట్రం.... ప్రస్తుతం అప్పుల పాలైన సంగతి తెలిసిందే. కెసిఆర్ ప్రభుత్వంలో... అప్పులతో పాటు అభివృద్ధి స్పష్టంగా కనిపించింది. కాలేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ, తదితర సంక్షేమ పథకాల కారణంగా అప్పులు అయ్యాయి.


అయితే వాటి వల్ల ప్రస్తుతం రైతులు.. అత్యధిక దిగుబడిని కూడా తీసుకువస్తున్నారు. కాబట్టి కెసిఆర్ అప్పు చేసిన ప్రతిఫలం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ అప్పును తీర్చే సత్తా తెలంగాణకు వచ్చింది. ఇటు హైదరాబాద్కు కూడా విపరీతంగా కంపెనీలు మొన్నటి వరకు రావడం జరిగింది. అయితే 2023 ఎన్నికల్లో... అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం... అప్పుల పేరుతో తెలంగాణ బ్రాండ్ ను దెబ్బతీస్తోంది. కెసిఆర్ ప్రభుత్వం దాదాపు 7 లక్షల కోట్లు అప్పులు చేసి పోయిందని...  వాటి మిత్తిలు కట్టలేక తమం నడుములు వంగిపోతున్నాయని రేవంత్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు.


అయితే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో.. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలంటే కంపెనీలే భయపడిపోతున్నాయి. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ తగ్గిపోగా.. హైదరాబాదులో పెట్టాల్సిన కంపెనీలు కూడా... వెనక్కి పోతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఎన్నికల కంటే ముందు ప్రకటించిన ఆరు గ్యారంటీలను... అమలు చేయడం కష్టమేనని నిపుణులు చెబుతున్నారు.


గత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను.. పూర్తిస్థాయిలో రేవంత్ రెడ్డి అమలు.. చేయలేకపోతోంది. ఇప్పుడు కొత్తగా.. 6 గ్యారంటీలు అమలు చేస్తే.. తెలంగాణ అప్పులు మోపడౌతాయి. ఫ్రీ బస్సు మినహా ఏ ఒక్క సంక్షేమ పథకం.. సరిగా తెలంగాణలో అమలు కావడం లేదని చెబుతున్నారు జనాలు. దీంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకత కూడా స్టార్ట్ అయింది. మరి ఈ అప్పుల నేపథ్యంలో ఆరు గారంటీలను ఎలా అమలు చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: