* ఏపీ అప్పులు 10 లక్షలు దాటినట్లు సమాచారం
* జగన్‌ పాలనలో ఎక్కువ అప్పులని ప్రచారం
* అప్పులతో అమరావతి అభివృద్దికి ఆటంకం


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.. గత పది సంవత్సరాలుగా అప్పులతో కొట్టుమిట్టాడుతోంది.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్  నుంచి విడిపోయిన తర్వాత సీమాంధ్రప్రదేశ్... ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నది. ముఖ్యంగా హైదరాబాద్ రాజధాని తెలంగాణకు వెళ్లడంతో... ఏపీకి రాజధాని లేకుండా పోయింది. తెలంగాణ అలాగే ఏపీకి ఉమ్మడి రాజధానిగా 10 సంవత్సరాలపాటు హైదరాబాద్ ఉన్నప్పటికీ... ఏపీకి రాజధాని మాత్రం... ఇప్పటికి కట్టుకోలేదు అక్కడి ప్రభుత్వం.


దానికి తోడు... చంద్రబాబు అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాలు విపరీతంగా అప్పులు చేశాయి. అమరావతి రాజధాని చేయాలని మొదట గెలిచిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం...నిర్ణయం తీసుకుంది. కానీ 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత.. మూడు రాజధానులని పెద్ద పెంట పెట్టాడు. దీంతో అమరావతికి అసలు పెట్టుబడులు రాకుండా పోయాయి.

 

చంద్రబాబు ప్రభుత్వం కంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఎక్కువ శాతం సంక్షేమ పథకాలు అమలు చేశారు. లోటు బడ్జెట్ లో ఉన్న ఏపీలో సంక్షేమ పథకాలు విపరీతంగా అమలు చేయడంతో అప్పులు మరింత పెరిగాయి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాదాపు పది లక్షల కోట్ల అప్పులు చేసిందని... తెలుగుదేశం చెబుతోంది. కానీ తమ ప్రభుత్వం 6 నుంచి ఏడు లక్షల కోట్లు మాత్రమే చేసిందని... చంద్రబాబు కంటే తక్కువే చేశామని జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారు.

 

ఏది ఏమైనా 5 లక్షల కోట నుంచి పది లక్షల మధ్య.. ఏపీ అప్పులు మాత్రం స్పష్టంగా ఉన్నాయని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఎంత సహాయం చేసినా కూడా... ప్రస్తుతం రాజధాని కట్టుకొని పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ తరహా రాజధాని కావాలంటే దాదాపు 50 సంవత్సరాలు పట్టి ఛాన్స్ ఉంది. ఆర్థిక భారం కారణంగా అమరావతి పూర్తి కావడం మరింత లేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల కంపెనీలు రాక ఉపాధి అవకాశాలు కూడా కోల్పోతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: