వైసీపీ చీఫ్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ పార్టీ అధికార ప్రతినిధిగా యాంకర్ శ్యామలకు పదవిని ఇవ్వడం జరిగింది. వివరాల్లోకి వెళితే.....టాలీవుడ్ యాంకర్ శ్యామల ప్రతి ఒక్కరికి సుపరిచితమే. అతి చిన్న వయసులోనే యాంకర్ గా, నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. లయ, గోరింటాకు, అభిషేకం వంటి సీరియల్స్ లోను తన అద్భుతమైన నటనను కనబరిచి తన సత్తాను చాటుకుంది. అనంతరం యాంకర్ గా మారి మా ఊరి వంట, పట్టుకుంటే పట్టు చీర వంటి షోలు చేసింది.


ఈ క్రమంలోనే లౌక్యం, ఒక లైలా కోసం వంటి ఎన్నో చిత్రాలలో నటించి నటిగా, యాంకర్ గా తన సత్తాను చాటుకున్న శ్యామల రాజకీయాల మీద ఉన్న ఆసక్తితో 2019 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఈ క్రమంలోనే తన భర్తతో కలిసి ఆ పార్టీ తరపున ప్రచారాలు కూడా చేసింది. తాజాగా వైసీపీ అధికార ప్రతినిధులుగా జగన్ శ్యామలకు కీలక పదవిని కట్టబెట్టారు. శ్యామలతో పాటు భూమన కరుణాకర్ రెడ్డి, జూపూడి ప్రభాకర్ రావు, ఆర్కే రోజా, ఆరే శ్యామలను అధికార ప్రతినిధులుగా నియమించారు.


వీరిలో భూమన, జూపూడి, రోజా వైసీపీ క్రియాశీలక రాజకీయాల్లో భాగమైన నేతలు. శ్యామల మాత్రం ఎన్నికల సమయంలో ఎలాంటి ప్రచారాలు నిర్వహించలేదు. ఎన్నికల్లో వైసీపీ ఓటమి అనంతరం ఆ పార్టీలోని కొందరు నాయకులు రాజకీయాలకు దూరం అవుతుండడం, పార్టీని వీరడం చూస్తూనే ఉన్నాం. అయితే యాంకర్ శ్యామల మాత్రం ధైర్యంగా రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనడానికి ముందుకు రావడం ప్రతి ఒక్కరికి ఆశ్చర్యాన్ని కలిగించింది.


పైగా వైసీపీ ప్రతినిధిగా ప్రత్యర్ధులపై విమర్శలు చేస్తూ ముందుంటుంది. ప్రత్యర్థులపై విమర్శలు చేయడానికి బాధ్యతలు తీసుకున్న శ్యామల ఆమె ధైర్య సాహసాలని, ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రశంసిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పిఠాపురం వేదికగా పవన్ కళ్యాణ్ ను విమర్శించిన శ్యామలపై టీడీపీ, జనసేన అభిమానులు, సోషల్ మీడియా యాక్టివిస్టులు శ్యామలపై తీవ్రస్థాయిలో ట్రోలింగ్ చేశారు. అయినప్పటికీ శ్యామల వాటిని లెక్కచేయకుండా ధైర్యంగా ముందుకు సాగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: